ఢిల్లీలోని ద్వారక ఫైవ్ స్టార్ హోటల్ భారత క్రికెట్ స్టార్ ఎం.ఎస్.ధోనీకి అచ్చొచ్చినట్టు కనిపించడం లేదు. హోటల్ లో అగ్నిప్రమాద ఘటన తరువాత తాజాగా మరో విషయం ఆలస్యంగా బయటికి వచ్చింది. హోటల్ సిబ్బంది ఒకరు ధోనీ ఫోన్లను చోరీ చేశాడు. ఉదయం ధోనీ బ్రేక్ ఫాస్ట్ కి వెళ్ళిన సమయంలో ఫోన్లు చోరీకి గురయ్యాయి. రూంకు వచ్చిన వెంటనే తన ఫోన్లు చోరీకి గురైన సంగతిని గుర్తించిన ధోనీ హోటల్ యాజమాన్యానికి, పోలీసులకు ఫిర్యాదు చేశార. సీసీ ఫుటేజ్ ను గమనించిన పోలీసులు ధోనీ రూం వైపు వెళ్లిన వ్యక్తిని హోటల్ సిబ్బందిగా గుర్తించారు. దీనితో అతన్ని అదుపులోకి తీసుకుని ఫోన్లను స్వాధీన పర్చుకున్నారు. తనకు అవి ధోనీ ఫోన్లని తెలియదని సదరు వ్యక్తి పోలీసులకు తెలిపాడు.