భారత్-ఆస్ట్రేలియా ల మధ్య జరుగుతున్న మూడో టెస్టు మ్యాచ్ లో భారత్ క్రమంగా పట్టు బిగిస్తున్నట్టు కనిపిస్తోంది. భారత్ తన తొలి ఇన్నింగ్స్ లో తొమ్మిది వికెట్లకు 603 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. ఆసిస్ తన తొలి ఇన్నింగ్స్ లో 451 పరుగులకు ఆలౌట్ అయిన సంగతి తెలిసిందే. దీనితో భారత్ కు తొలి ఇన్నింగ్స్ లో కీలకమైన 152 పరుగుల ఆధిక్యం లభించింది. చక్కటి స్ట్రోక్స్ తో ఆకట్టుకున్న పుజారా డబుల్ సెంచరీ చేశాడు. సాహా సెంచరీతో అలరించాడు. ఆ తరువాత బ్యాటింగ్ కు దిగిన ఆసిస్ 23 పరుగులకే రెండు వికెట్లను కోల్పోయింది. ఈ రెండు వికెట్లు జడేజా ఖాతాలో పడ్డాయి.