మోడీ చెవిలో ములాయం ఏం చెప్పారు…?

ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రిగా యోగి ఆదిత్యనాథ్‌ ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరైన ఉత్తర్ ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ములాయం సింగ్ యాదవ్ ప్రధాని నరేంద్ర మోడీ చెవిలో ఏదో విషయంపై కొద్దిసేపు గుసగుస లాడడం ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. దీనిపై సామాజిక మాధ్యామాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది. యూపీ ఎన్నికల్లో సమాజ్ వాదీ పార్టీ ఘోరంగా దెబ్బతినగా అందరి అంచనాలను తలకిందులు చేస్తూ బీజేపీ భారీ విజయాన్ని సాధించింది. ఎన్నికలకు ముందు ములాయం కుమారుడు, ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ తండ్రి ములాయం ల మధ్య మొదలైన వివాదం చినికి చినికి గాలివానగా మారి కుమారుడు అఖిలేశ్ తండ్రి పై తిరుగుబాటుకు దారితీసింది. ఎన్నికల సమయంలో ములాయం వివాదం సర్థుమణిగిందని చెప్పినా అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయి సమాజ్ వాదీ పార్టీ ఘోరంగా ఓటమి చవిచూసింది. కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుని ఎన్నికల్లో పోటీ చేసిన అఖిలేశ్, రాహుల్ ధ్వయం రాష్ట్రమంతటా ప్రచారం నిర్వహించినా ఫలితం లేకుండా పోయింది.
ములాయం సింగ్ యాదవ్ ప్రధాని చెవిలో ఏం చెప్పారనే దానిపై పలువురు సెటైర్లు వేస్తున్నారు. బీజేపీ పై ఒంటికాలిపై లేచే ములాయం సింగ్ యాదవ్ మోడీ చెవిలో గుసగుసలాడడం చర్చనీయాంశమైంది. ఇంతకీ ములాయం మోడీకి ఏం చెప్పారో మరి…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *