షాద్ నగర్ లో భారీ అగ్ని ప్రమాదం

0
53

shad 2 shad1
షాద్ నగర్ ఆర్టీసీ పార్కింగ్ ప్రదేశంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది.  ఈ ప్రమాదంలో దాదాపు 500 ద్విచక్ర వాహనాలు అగ్నికి ఆహుతయ్యాయి. పెద్ద ఎత్తున ఎగిపడుతున్న మంటలను ఆర్పేందుకు అగ్నిమాపక శకటాలు ప్రయత్నిస్తున్నాయి. భారీ ఎత్తున ఎగిసిపడుతున్న మంటలను అర్పేందుకు చేస్తున్న ప్రయత్నాలు కొలిక్కి రావడం లేదు. మంటలు భారీగా ఎగిసి పడుతుండడంతో అక్కడ భయానక వాతావరణం నెలకొంది. షాద్ నగర్ ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఉన్న తుల్జా భవానీ, లక్ష్మీ నరసింహా పార్కింగ్ ఏరియాల్లో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదానికి గల కారణాలు పూర్తిగా తెలియరాలేదు. అక్కడ ఉన్న ట్రాన్స్ ఫార్మర్ పేలడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు చెప్తున్నప్పటికీ పోలీసులు ఈ విషయాన్ని దృవీకరించలేదు.

Wanna Share it with loved ones?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here