అతివాద నేతకు పట్టంగట్టిన బీజేపీ

0
58

ఉత్తర్ ప్రదేశ్ లాంటి అతివిశాలమైన, అత్యధిక జనాభ కలిగిన రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఎవరిని నియమిస్తారనే అంశంపై ఊహాగానాలకు తెరదించుతూ బీజేపీ అధిష్టానం అనూహ్య నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి పీఠానికి వచ్చిన పేర్లలలో అందరనీ తోసిరాజని అతివాద బీజేపీ నేత యోగి ఆదిత్యనాథ్‌ ను ముఖ్యమంత్రిగా ఎంపికచేయడంతో అందరి అంచనాలు తలకిందులయ్యాయి. యూపీ లాంటి కీలక రాష్ట్రానికి ఏకంగా ఒక పీఠాధిపతిని ముఖ్యమంత్రిగా నియమించి అందరినీ ఆశ్చర్యపర్చింది బీజేపీ అధిష్టానం. ఆదివారం ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్న యోగి ఆదిత్యనాథ్‌ అతివాద బీజేపీ నేతల్లో ఒకరిగా పేరుపొందారు.
ఘర్ వాపసీ లాంటి కార్యక్రమాల ద్వారా ఆయన హింధూ మతం నుండి క్రిస్టియన్ మతం వైపు మళ్లిన వారిని తిరిగి హిందూ మతంలోకి తీసుకుని రావడం ద్వారా దేశవ్యాప్తంగా సంచలనానికి కేంద్ర బింగువయ్యారు. ప్రస్తుతం ఆయన ఘోరక్ నాథ్ దేవాలయనికి పీఠాదీశ్వరుడిగా కూడా ఉన్న ఆయన 26 సంవత్సరాల చిన్న వయసులోనే లోక్ సభకు ఎంపికై చరిత్ర సృష్టించారు. ముక్కు సూటిగా వ్యవహరించడంలోనూ, అనుకున్న పని సాధించగల నేతగా ఆయనకు పేరుంది. నిత్యం ప్రజల్లో ఉండడం, కార్యకర్తలతో సత్ససంబంధాలు ఆయన ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించడానికి బాగా కలిసి వచ్చాయి. వీటన్నిటితో పాటుగా ఆర్ఎస్ఎస్ మద్దతు ఆయనకు పూర్తిగా ఉంది.
ముస్లీం జనాభా గణనీయంగా ఉన్న ఉత్తర్ ప్రదేశ్ లాంటి రాష్ట్రంలో ఏకంగా ఒక పీఠాదీశ్వరుడిని సీఎం చేయడం ద్వారా బీజేపీ తన వైఖరిని స్పష్టంగానే చెప్పింది. 2007లో గోరఖ్ పూర్  మత ఘర్షణను ప్రేరేపిస్తున్నారంటూ ఈయనను పోలీసులు అరెస్టు చేసి జైలుకు తరలించారు. యోగి ఆదిత్యనాథ్‌ ప్రసంగాల వల్ల ఉధ్రిక్తతలు పెరుగుతున్నాయంటూ ఘర్షణలు జరిగిన ప్రాంతాల్లో ఈయన పర్యటించరాదని మెజిస్టేట్ ఉత్తర్వులు జారీ చేశారు. వాటిని తోసిపుచ్చిన యోగిని పోలీసులు అరెస్టు చేశారు. ఉత్తర్ ప్రదేశ్ గ్రామీణ ప్రాంతాల్లో తన విద్వేష ప్రసంగాల ద్వారా ప్రజలను రెచ్చగొడుతున్నారంటూ యోగి ఆదిత్యనాథ్‌ పై విమర్శలు వచ్చాయి.

Wanna Share it with loved ones?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here