కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం 11 మంది మృతి

0
54

కర్ణాటక లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 11 మంది ప్రాణాలు కోల్పోయారు. లారీ టైరు పగిలి అదుపుతప్పి రెండు ఆటోలు, టెంపో ట్రావెలర్ లను ఢీ కొనడంతో ఈ ప్రమాదం జరిగింది. చిత్ర దుర్గ జిల్లా ఏలే రాంపుర వద్ద చోటుచేసుకున్న ఈ దురదృష్టకర ఘటనలో చనిపోయిన వారంతా కూలీలే. విజయపుర జిల్లాకు చెందిన కార్మికులు ఆటోలు వెళ్తుండగా లారీ మృత్యూరూపంలో వెంటాడి వారి ప్రాణం తీసింది. వేగంగా వెళ్తున్న లారీ టైరు పేలిపోవడంతో డ్రైవర్ దానిపై నియంత్రణ కోల్పోయాడు. లారీని అదుపుచేయలేకపోవడంతో అదే వేగంతో లారీ రెండు ఆటోలతో పాటుగా టెంపో ట్రావెలర్ లను ఢీ కొట్టింది. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలను చేపట్టారు.
 

Wanna Share it with loved ones?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here