పల్లె కన్నీరు తుడుస్తున్న ప్రభుత్వం

by: A.Narasimha raju
పల్లెలు దేశానికి పట్టుకొమ్మలు…ఖద్దరేసిన ప్రతీ రాయకీయ నేత వల్లేవేసే మటలివి. సంప్రదాయ పనులు కరువై కన్నతల్లిని ఉన్న ఊరిని వదిలి పట్టణాలకు వలసపోతున్నా పల్లెలపై మాట్లాడిన పెద్దలెవరు స్పందిచకపోవడం తో పల్లె కన్నీరు పెట్టింది. కులవృత్తులు కూడు పెట్టక కూలీకోసం పట్టణాలకు పయనమైన వారెందరో…గ్రామాలను తిరిగి ఆర్థిక స్వయం ప్రతిపత్తివైపుగా నడిపించే ప్రయత్నాలు చేస్తున్న తెలంగాణ సర్కారు ప్రయత్నాలను తప్పకుండా అభినందించాల్సిందే. ముందుగా వట్టిపోయిన చెరువుల మరమ్మత్తులు చేసి చెరువులకు నీళ్లతోనూ రైతుల గుండెల్లో ఆత్మవిశ్వాసాన్ని ఓకేసారి నింపే ప్రయత్నం చేశారు. చెరువులకు గత వైభవం వస్తే అంతకన్నా కావాల్సిందేముంది. తెలంగాణ ప్రాంతానికే తలమానికంగా నిల్చిన గొలుసు కట్టు చెరువులు పాలకుల నిర్లక్ష్యం వల్ల, ప్రజల అలక్షం వల్ల కనిపించకుండా పోయే పరిస్థితులు తలెత్తాయి.
కనుమరుగు అయిన చెరువులను పూర్వవైభనం తీసుకుని వచ్చే ప్రయత్నాలు చేయడం దానికి ప్రజల నుండి వచ్చిన మద్దతుతో చెరువులు నిండి గ్రామీణ ప్రాంతాల్లో  రైతుల గుండెల్లో ఆత్మవిశ్వాసం నిండింది. పల్లెల్లో కులవృత్తులు దారుణంగా దెబ్బతిన్న సంగతి మనందరికీ తెలిసిందే. కుమ్మరి చక్రం ఆగిపోయి… కమ్మరి కొలిమి వేడెక్కక్క… సాలన్న మగ్గం ఆడని స్థితిలో తిరిగి ఈ సంప్రదాయ వృత్తులకు ప్రాణం పోసే చర్యలు ప్రారంభించడం నిజంగా అభినందనీయం. కుల ప్రాతిపదికన బడ్జెట్ అంటూ కొంత మంది చేస్తున్న వ్యాఖ్యల్లో నిజంగా దారుణం. గ్రామీణ ఆర్థిక రంగం మొత్తం సామాజిక వృత్తుల మీద ఆధారపడిందే. ఆయా వృత్తులపై ఆధారపడిన వారు ఆర్థికంగా నిలదొక్కుకుంటే తద్వారా గ్రామీణ ఆర్థిక వ్యవస్థ గాడిలో పడుతుంది.
మన గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు, కుల వృత్తులకు ఉన్న సంబంధం చాలా గొప్పది. ఒకరిపై ఒకరు ఆధారపడి జీవించే ఈ వ్యవస్థ గాడి తప్పితే ఆ ప్రభావం అందరిపైనా పడుతుంది. మన గ్రామీణ వృత్తి వ్యవస్థలో ఒకరు ఎక్కువ మరొకరు తక్కువ అనే ప్రశ్నే తలెత్తదు. ఒకరి పై ఒకరు ఒకరి ద్వారా మరొకరు ఆధారపడి, లాభపడే వ్యవస్థ మనకు అనాధిగా వస్తోంది. ఇటీవల కాలంలో పాలకుల నిర్లక్ష్యం వల్లే కుల వృత్తులు కునారిల్లడంతో పల్లే ఆర్థిక వ్యవస్థ గాడితప్పింది. ఒకప్పుడు కనిపించిన మేకల మందలు ఇప్పుడు కనిపించడం లేదు. దీనిపై ఆధారపడిన వారెందరో పట్టణాల్లో కూలీలుగా మిగిలి పోయారు. మందలు లేకపోవడంతో సంప్రదాయ ఎరువుకూ కరవు ఏర్పడింది. దీనితో కృతిమ ఎరువులు కొనక తప్పని పరిస్థితి. “మంద పెట్టడం” అని పిల్చుకునే ఈ ప్రక్రియలో ప్రతీ ఎకరానికి యాబై నుండి వంద గెర్రెలను పొలాల్లో వదులుతారు. వాటి పేడతో సంప్రదాయ ఏరువుతో పోలాలు సారవంతం అయ్యేవి. ఇటు రైతులకు, అటు గొర్రెల పెంపకం దారులు ఇద్దరికీ ఉపయోగంగా ఉండే ఈ విధనం పల్లెల్లో కనుమరుగు అయ్యే పరిస్థితులు వచ్చాయి. మందలే లేకపోవడంతో మదంపెట్టడం ఎక్కడిది. ఈ ఒక ఉదాహరణ చాలు  పల్లెల్లో అనాధిగా పల్లెలు ఉభయతారకంగా ఏ విధంగా ఆర్థిక స్వావలంబన సాధించాయో చెప్పడాలి.
ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల వల్ల తిరిగి పల్లెలు ఆర్థిక స్వావలంబన దిశగా అడుగులు వేయాలని ఆశిద్దాం.
(రచనలకు ఆహ్వానం… మీ రచనలను మాకు telanganaheadlines@gmail.com కు పంపండి)
 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *