ఛీ…ఛీ… ఇదేం తల్లి

కన్నబిడ్డలను తల్లిదండ్రులు కంటికిరెప్పలా కాపాడుకుంటారు. తమ పిల్లలకు ఏ మాత్రం ఇబ్బంది వచ్చిన తల్లడిల్లిపోతారు. తల్లిని దేవుడికి ప్రతీరూపంగా కొలుస్తారు. అట్లాండితి కన్న పిల్లలను ఒక మహా తల్లి హింసించిన తీరును చూస్తే సభ్య సమాజం తలవంచుకోవాల్సిందే. పిల్లలతో మూత్రం తాగించడంతో పాటుగా వారి మర్మాయవాలపై వాతలు పెట్టిన ఈ కసాయి తల్లిపై బిడ్డలు పోలీసులకు ఫిర్యాదు చేశారు.  కన్న బిడ్డలు మాట వినడంలేదనే నెపంతో పిల్లలను అతి క్రూరంగా కన్న తల్లే హింసించిన ఘటన హైదరాబాద్ లోని జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం సంగారెడ్డికి చెందిన మురళీకృష్ణ, అనూషలు హైదరాబాద్ కు వలస వచ్చారు. మురళీ కృష్ణ ఆటో డ్రైవర్ గా పనిచేస్తుండగా అనూష స్థానికంగా ఒక మహిళా మండలిలో పనిచేస్తోంది. హైదరాబాద్ వచ్చిన తరువాత అనూష ప్రవర్తనలో మార్పు రావడంతో ఇంటినీ భర్తను పట్టించుకోవడం మానేసింది. దీనితో భర్త మురళీ కృష్ణ భార్యకు దూరంగా ఉంటున్నాడు. పిల్లలు తల్లితోనే ఉండిపోయారు.
ఈ క్రమంలో అనూషకు కొంత మందితో చనువుగా ఉంటున్నట్టు పిల్లలు చెప్తున్నారు. పిల్లలపై తీవ్ర కోపం చూపించే అనూష పిల్లలను చిత్రహింసలకు గురిచేసింది. వాతలు తేలేలా కొట్టడంతో పాటుగా తమతో మూత్రం తాగించేదని పిల్లలు వాపోయారు. అంతటితో ఆగని ఆ కసాయి పిల్లల మర్మాయవాలపై వాతలు పెట్టింది. దీనితో తట్టుకోలేకపోయిన పిల్లలు తండ్రిని కలుసుకుని విషయాలు చెప్పడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తల్లి చేతిలో చిత్రహింసలకు గురైన చిన్నారులను చూపి పోలీసులుకు కూడా చలించిపోయారు. ప్రస్తుతం పరారలో ఉన్న అనూష కోసం పోలీసులు గాలిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *