సింగరేణిలో వారసత్వ ఉద్యోగాలకు బ్రేక్

0
43

సింగరేణి సంస్థలో వారసత్వ ఉద్యోగాల నోటిఫికేషన్ ను రాష్ట్ర హైకోర్టు కొట్టివేసింది. వారసత్వ ఉద్యోగాలు చెల్లవంటూ హైకోర్టు చెప్పింది. వైద్యపరంగా ఉద్యోగం చేయడానికి అనర్హుడైతేనే వారసత్వ ఉద్యోగాల కోసం ఎంపికచేయాలని హైకోర్టు ఆదేశాలు జారీచేసింది. ఇప్పటికే వారసత్వ ఉద్యోగాల  కోసం విడుదల చేసిన నోటిఫికేషన్ ను వెంటనే రద్దు చేసి కొత్త  నోటిఫికేషన్ ప్రకారం ఉద్యోగాలను భర్తీ చేయాలని కోర్టు ఆదేశించింది. కోర్టు నిర్ణయంతో సింగరేణిలో వారసత్వ ఉద్యోగాల నియామకాలకు బ్రేక్ పడినట్టయింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ నియమాలకు కోర్టు బ్రేక్ వేయడంతో తదుపరి కార్యాచరణపై ప్రభుత్వ వర్గాలు దృష్టిసారించాయి. వారసత్వ ఉద్యోగాలపై చాలా కాలంగా కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తూ వస్తున్నాయి. దీన్ని కొంత మంది నిరుద్యోగులు కోర్టులో సవాలు చేయడంతో ప్రభుత్వ విధానాన్ని కోర్టు తప్పుబట్టింది.

Wanna Share it with loved ones?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here