పోలవరంపై ఏపీ అసెంబ్లీలో రగడ

0
43

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో పోలవరం పై జరిగిన చర్చ సందర్భంగా అధికార విపక్ష సభ్యులు తీవ్ర వాదోపవాదాలకు దిగారు. ఒకరిపై ఒకరు తీవ్రంగా విమర్శలు గుప్పించుకున్నారు. పోలవరం పై ప్రశ్నోత్తరాల సమయంలో చర్చ సందర్భంగా అధికార టీడీపీ, విపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ లు ఒకరు పై ఒకరు విమర్శల వర్షం కురిపించుకున్నారు. చీఫ్ విప్ కాల్వ శ్రీనివాస్ మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టులు వైఎస్ఆర్ కాంగ్రెస్ అడ్డుకునే ప్రయత్నం చేస్తోందని మండిపడ్డారు. దీనికి ఆటంకాలు కల్పించడం ద్వారా ప్రాజెక్టు నిర్మాణాన్ని ఆలస్యం చేసే ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. రైతులకు నీళ్లు రాకుండా అడ్డుకుంటూ రాజకీయాలు చేస్తున్నారని అన్నారు.
విపక్ష నేత జగన్ మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టు విషయంలో టీడీపీ ప్రభుత్వం ఏం సాధించిందో చెప్పాలన్నారు. విభజన చట్టంలోనే ఈ ప్రాజెక్టుకు నిధులు ఇవ్వడానికి కేంద్రం ఒప్పుకుందని దాన్ని తమ గొప్పగా టీడీపీ ప్రచారం చేసుకోవడం దారణమన్నారు. ఈ సమయంలో జోఖ్యం చేసుకున్న మంత్రి దేవినేని పోలవరం పరిధిలోని గ్రామాలను ఖాళీ చేయించడంతో పాటుగా పరిహారం ఇవ్వడానికి ఎక్కువ నిధులు ఖర్చయ్యాయని, దీనివల్ల ప్రాజెక్టు వ్యయం కూడా పెరిగిందన్నారు. 2019 నాటికి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తామని చెప్పారు. విపక్షనేత జగన్ దీనిపై స్పందిస్తూ రాష్ట్ర ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయడంలో విఫలమైందన్నారు. నిధులు రాబట్టలేక చేతులెత్తేస్తోందన్నారు. ఈ సమయంలో ప్రశ్నోత్తరాల సమయంలో ఇంతకంటే సమయం ఇవ్వలేమంటూ స్పీకర్ కోడెల చెప్పడంతో వివాదం మొదలైంది. వైసీపీ సభ్యులు స్పీకర్ పోడియం వద్దకు వచ్చి ఆందోళనకు దిగారు. దీనితో స్పీకర్ సభను వాయిదా వేయాల్సి వచ్చింది.

Wanna Share it with loved ones?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here