గోవా సీఎంగా పారికర్ ప్రమాణ స్వీకారం

0
51

గోవా ముఖ్యమంత్రిగా మనోహర్ పారికర్ ప్రమాణస్వీకారం చేశారు. కేంద్రంలో రక్షణ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్న పారికర్ తన పదవికి రాజీనామా చేసి గోవా ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. గవర్నర్ మృదులా సిన్హా ఆయనతో ప్రమాణ స్వీకారం చేశారు. గోవా అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీకీ స్పష్టమైన మెజార్టీ రాకపోవడంతో స్థానిక పార్టీల సహకరంలో పారికర్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. గోవా ముఖ్యమంత్రి పారికర్ ప్రమాణ స్వీకారాన్ని ఆపాలంతటూ కాంగ్రెస్ సుప్రీం కోర్టును ఆశ్రయించినప్పటికీ ఫలితం లేకపోడంతో మనోహర్ పారికర్ ప్రమాణస్వీకారానికి మార్గం సుగమం అయింది. 40 స్థానాలున్న గోవా అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీకి 17 స్థానాలు వచ్చినప్పటికీ మ్యాజిక్ ఫిగర్ ను చేరుకోలేకపోడవంతో 13 స్థానాలను సంపాదించుకున్న బీజేపీ ఇతర పార్టీల సహకారంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. కేంద్రమంత్రులు నితిన్‌ గడ్కరీ, వెంకయ్యనాయుడు పలువురు భాజపా నేతలు ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరయ్యారు.
 

Wanna Share it with loved ones?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here