అధికారం కోసం బీజేపీ అడ్డదారులు:రాహుల్

0
77

ప్రజాస్వామ్యాన్ని భారతీయ జనతా పార్టీ ఖూనీ చేస్తోందని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆరోపించారు. గవర్నర్ పదవిని అడ్డుపెట్టుకుని వక్రమార్గాల్లో బీజేపీ గోవా,మణిపూర్ లలో అధికారంలోకి వచ్చేందుకు ప్రయత్నిస్తోందని ఆయన అన్నారు. బీజేపీ చర్యలు ఎంత మాత్రం సమర్థనీయం కాదన్నారు. గోవా, మణిపూర్ లలో ఎక్కువ సీట్లను సాధించిన కాంగ్రెస్ పార్టీని వదిలి బీజేపీని ప్రభుత్వ ఏర్పాటుకు పిలవడం సరైన చర్య కాదని అన్నారు. ప్రజాస్వామ్య విలువలను, రాజ్యాంగ స్పూర్తికి బీజేపీ తీలోదకాలు ఇచ్చిందని రాహుల్ మండిపడ్డారు. ప్రజా తీర్పుకు భిన్నంగా వక్ర మార్గంలో అధికారంలోకి వచ్చేందుకు బీజేపీ చేస్తున్న ప్రయత్నాలు దారుణమన్నారు. రాజ్యాంగ భద్దంగా వ్యవహరించాల్సిన గవర్నర్లు బీజేపీ కి అనుకూలంగా వ్యవహరించడం సరికాదని రాహుల్ మండిపడ్డారు. ఎక్కువ సీట్లను సంపాదించుకున్న పార్టీని పక్కన పెట్టి రెండో స్థానంలో నిల్చిన పార్టీని ప్రభుత్వ ఏర్పాటుకు పిలవడాన్ని ఏ విధంగా సమర్థించుకుంటారో చెప్పాలన్నారు. రాజకీయాల్లో నీతిని గురించి, విలువల గురించి పెద్దపెద్ద మాటలు చెప్పే ప్రధాని నరేంద్ర మోడీ అధికారం కోసం అడ్డదారు తొక్కుతున్నారని తీవ్ర ఆరోపణలు గుప్పించారు.
ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల్లో బీజేపీకి రెండు రాష్ట్రాల్లో మెజార్టీ వస్తే తమకు  మూడు రాష్ట్రాల్లో మెజార్టీ సీట్లు వచ్చిన విషయాన్ని గుర్తుంచుకోవాలని రాహుల్ గాంధీ అన్నారు. ఉత్తర్ ప్రదేశ్, ఉత్తరా ఖండ్ లలో తమ పార్టీ ఓటమిని ఒప్పుకున్న ఆయన అందుకు గల కారణాలను అన్వేషిస్తామని చెప్పారు.

Wanna Share it with loved ones?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here