2జీ కేసులో అంతా నిర్థోషులే

2జీ స్పెక్టం కుంభకోణంలో నిందితులంతా నిర్థోషులేనని సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం తీర్పు చెప్పింది. దేశవ్యాప్తంగా సంచలనం రేపిన ఈ కేసులో టెలికాం శాఖ మాజీ మంత్రి ఎ.రాజా తోపాటుగా కరుణానిధి కుమారై, ఎంపి కమిమొళి కూడా నిర్థోషులుగా బయటపడ్డారు. వీరితో పాటుగా ఈ కేసులో నిందితులుగా ఉన్న వారందరినీ సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం నిర్థోషులుగా ప్రకటించింది. 2జీ కేసు విచారణ సందర్భంగా దేశవ్యాప్తంగా దీనిపై చర్చ జరుగుతోంది. అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఈ కేసుకు సంబంధించిన కేసులో అంతా నిర్థోషులుగా కోర్టు పేర్కొనడం సంచలనం రేపింది.
యూపీఏ ప్రభుత్వ హయంగా 1.76 లక్షల కోట్ల మేర ప్రభుత్వానికి నష్టం వాటిల్లో విధంగా వ్యహరించారంటూ రాజాతో పాటుగా పలువురిపై కంట్రోల్ అండ్ ఆడిట్ జర్నల్ (కాగ్) చేసిన ఆరోపణల ఆధారంగా సీబీఐ కేసును నమోదు చేసింది. కేసు నమోదు కావడంతో రాజాను మంత్రి పదవి నుండి తప్పించడంతో పాటుగా సీబీఐ ఆయన్ను అరెస్టు చేసింది. దాదాపు ఏడాది పాటు రాజా, కనిమోళి తదితరులు జైల్లో ఉన్నారు. సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం ఇచ్చిన తీర్పును హైకోర్టులో సవాలు చేస్తామని సీబీఐ అంటోంది.