భూమా కు ఏపీ అసెంబ్లీ నివాళి

0
58

నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డికి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఘనంగా నివాళులు అర్పించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంతాప తీర్మానంపై మాట్లాడుతూ భూమా నాగిరెడ్డి మృతి తీరని లేటని అన్నారు. భూమా ప్రజల మధ్య తిరిగే ప్రజా నాయకుడని మంచి భవిష్యత్తు ఉన్న అతను చిన్న వయసులోనే కన్నుమూయడం బాధాకరమన్నారు. భూమా నాగిరెడ్డి శనివారం తనతో మాట్లాడాడని ఆదివారం ఆయన తిరిగిరాని లోపాలకు వెళ్లిపోయాడని అన్నారు. తల్లీ, దండ్రులను ఇద్దరినీ పోగొట్టుకున్న భూమా కుటుంబానికి తమ పార్టీ అండగా ఉంటుందన్నారు. నాగిరెడ్డికి అవసరమైన వైద్య సేవలు అందచేయడానికి హెలిక్యాఫ్టర్ ను ఏర్పాటు చేసినప్పటికీ ఫలితం లేకుండా పోయిందన్నారు. తన నియోజకవర్గం అభివృద్దికోసం తపించే భూమా నాగిరెడ్డి ఎప్పుడూ పదవులు కోరుకోలేదన్నారు. ఉప ముఖ్యమంత్రి కే.ఈ. కృష్ణ మూర్తితో పాటుగా ఇతర ఎమ్మెల్యేలు భూమా చేసిన సేవలను కొనియాడారు. విపక్ష వైసీపీ సంతాప తీర్మానంపై జరిగిన చర్చలో పాల్గొనలేదు.

Wanna Share it with loved ones?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here