"భూమా" ఆఖరిచూపు కోసం భారీగా జనం

0
33

నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి మృతదేహాన్ని ప్రజల సందర్శనార్థం ఆళ్లగడ్డలోని ఆయన నివాసంలో ఉంచారు. భూమాను కడసారి చూసేందుకు పెద్ద సంఖ్యలో ఆయన అభిమానులు, అనుచరులు ఆళ్లగడ్డకు తరలివచ్చారు. తీవ్రమైన గుండెపోటుతో చనిపోయిన భూమా అళ్లగడ్డతో పాటుగా కర్నూలు జిల్లా రాజకీయాల్లో కీలక పాత్ర పోషించారు. రాష్ట్ర వ్యాప్తంగా భూమాకు అనుచరగణం ఉంది. కర్నూలు జిల్లాతో పాటుగా రాయలసీమ జిల్లాలల నుండి, హైదరాబాద్ నుండి కూడా పెద్ద సంఖ్యలో భూమా అభిమానులు ఆళ్లగడ్డకు చేరుకున్నారు. మూడు సంవత్సరాల క్రితం భూమా నాగిరెడ్డి భార్య శోభా నాగిరెడ్డి రోడ్డు ప్రమాదంలో చనిపోగా ప్రస్తుతం భూమా నాగిరెడ్డి కూడా గుండెపోటుతో కన్నుమూయడంతో వారి పిల్లలు శోక సంద్రంలో మునిగిపోయారు.
భూమా నాగిరెడ్డి అనుచరులతో పాటుగా తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ఆళ్లగడ్డకు చేరుకుంటున్నారు. తెలుగుదేశం పార్టీ నాయకులతో పాటుగా వివిధ పార్టీల నేతలు కూడా భూమాను చివరి సారిగా చూసేందుకు వస్తున్నారు.
 

Wanna Share it with loved ones?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here