మాదాపూర్ లో మట్టిపెళ్లలు పడి ఇద్దరు మృతి

0
61

మట్టిపెళ్లలు విరిగి ఇద్దరు మహిళా కూలీలు సజీవ సమాధి అయిన ఘటన  మాదాపూర్ లోని గూగుల్ కార్యాలయం సమీపంలో జరిగింది. నిర్మాణంలో ఉన్న ఓ భవన సెల్లార్ కోసం గుంతలు తీస్తుండగా అఖస్మాత్తులు మట్టిపెళ్లలు విరిగి పడ్డాయి. ఈ ప్రమాదంలో అక్కడ పనిచేస్తున్న ఇద్దరు కూలీలు మరణించారు. పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. ఒకరి మృతదేహాన్ని వెలికి తీయగా మరొకరి మృత దేహం కోసం పోలీసులు మట్టిని తొలగిస్తున్నారు. సరైన భద్రతా ప్రమాణాలు పాటించకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు ప్రాథమికంగా ఒక అంచానాకు వచ్చారు. సెల్లార్ కోసం గుంతలు తీసే సమయంలో నిర్థేశించిన భద్రతా ప్రమాణాలు ఏవీ కనిపించడం లేదని పోలీసులు పేర్కొన్నారు. ప్రమాదం జరిగిన సమయంలో ఇద్దరిపైనే మట్టిపెళ్లలు విరిగిపడ్డాయా ఇంకెవరైనా ఉన్నారా అనేది పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతానికి మట్టిపెళ్లల కింద ఎవరైనా ఉన్నారా లేదా అనేదానిపై దృష్టిపెట్టామని ప్రమాదానికి కారణాలపై విచారణ జరుగుతుందని పోలీసులు చెప్పారు.

Wanna Share it with loved ones?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here