ఐదు రాష్ట్రాల ఫలితాలు….

8
ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు పూర్తిగా తెలిసిపోయాయి. ఉత్తర్ ప్రదేశ్ లో బీజేపీ జెండా ఎగిరింది. ఇక్కడ అధికార సమాజ్ వాదీ పార్టీ, కాంగ్రెస్ కూటమికి గట్టి ఎదురుదెబ్బ తగలగా బీఎస్పీ పరిస్థితి దారుణంగా తయారైంది. ఉత్తరా ఖండ్ లో ప్రభుత్వ వ్యతిరేక పవనాలు బలంగా వీచాయి. ఇక్కడ కూడా అధికార కాంగ్రెస్ ను మట్టికరిపించడం ద్వారా బీజేపీ అధికారంలోకి వచ్చింది. పంజాబ్ లోనూ ప్రభుత్వ వ్యతిరేకత బలంగా పనిచేసింది. అధికార అకాలీదళ్ , బీజేపీ కూటమి దారుణంగా ఓడిపోయింది. కాంగ్రెస్ పార్టీ ఇక్కడ అధికారాన్ని హస్తగతం చేసుకుంది. పంజాబ్ లో ఆప్ రెండో స్థానంలో నిలవగా అధికార కూటమి మూడో స్థానంలో తృప్తి పడాల్సి వచ్చింది. గోవాలో అధికార బీజేపీకి ఎదురుదెబ్బ తగిలింది. ఇక్కడ హంగ్ ఏర్పడింది. కాంగ్రెస్ పార్టీ అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటికీ అధికారంలో రావడానికి కావాల్సినన్ని సీట్లను సంపాదించలేకపోయింది. మెజార్టీకి  నాలుగు సీట్ల దూరంలో నిల్చిపోయింది. మణిపూర్ లోనూ అధికార కాంగ్రెస్ మెజార్టీకి కొద్ది దూరంలో నిల్చిపోయింది. ఇక్కడ బీజేపీ కాంగ్రెస్ కు గట్టిపోటీ ఇచ్చినప్పటికీ అధికారంలోకి రాలేకపోయింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *