ఎమ్మెల్సీ ఎన్నికలకు అంతా రెడీ

0
46
Person voting

హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్ నగర్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు చేసింది. మార్చి 9 (గురువారం) జరిగే ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తయ్యాయని మొత్తం 126  పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్టు ఎన్నికల ప్రధాన అధికారి భన్వర్ లాల్ తెలిపారు. 23,789 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. మొత్తం 12 మంది అభ్యర్థులు రంగంలో ఉన్నారు. ఉదయం 8 గంటల నుండి సాయంత్ర 6 గంటల వరకు పోలింగ్ ను నిర్వహిస్తున్నట్టు భన్వర్ లాల్ తెలిపారు. అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద పటిష్టమైన బందోబస్తును ఏర్పాటు చేయడంతో పాటుగా ఫ్లైయింగ్ స్వాడ్ కూడా పోలీంగ్ కేంద్రాలను పరిశీలిస్తుందని భన్వర్ లాల్ తెలిపారు. ఓటరు కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, ఆధార్ కార్డు, పాన్‌కార్డు, డిగ్రీ ధృవపత్రాలలో ఏదైనా ఒకటి చూపించి ఓటువేయవచ్చని చెప్పారు. ఓటు హక్కు లేనివారు ఓటు వేయడానికి ప్రయత్నిస్తే కఠిన చర్యలు తప్పవని భన్వర్ లాల్ హెచ్చరించారు. పీఆర్ టీయు తరపున టీఆర్ఎస్ మద్దతుతో  పోటీ చేస్తున్న సిట్టింగ్ ఎమ్మెల్సీ కాటేపల్లి జనార్థన్ రెడ్డి తో పాటుగా కొంగర శ్రీనివాస్, అరకల కృష్ణా గౌడ్, ఆది లక్ష్మయ్య, గాల్ రెడ్డి హర్షవర్థన్ రెడ్డి, మీసాల గోపాల సాయిబాబా, నర్రాభూపతి రెడ్డి , ఎం.వి.నర్సింగ్ రావు, పాపాన్నగారి మాణిక్ రెడ్డి, ఎం.మమత, ఎ.వి.ఎన్.రెడ్డి, ఎస్. విజయ్ కుమార్ కుమార్ లు బరిలో ఉన్నారు. ఈనెల 20 న ఎన్నికల ఫలితాలను ప్రకటిస్తారు.

Wanna Share it with loved ones?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here