తెలంగాణలో వడగళ్ల వాన

0
55

తెలంగాణలోని పలు చోట్ల ఈదురు గాలులతో కూడిన వర్షం పడింది. కొన్ని చోట్ల వడగళ్లు కూడా పడ్డాయి. మంగళవారం ఉదయం నుండి మబ్బులు కమ్మగా సాయంత్రానికి పలు చోట్ల ఊరుములు, మెరుపులు, భారీ గాలులతో కూడిన వర్షం పడింది. కరీంనగర్, వరంగల్, యాదాద్రి, నల్గొండ జిల్లాల్లో వర్షాలు పడ్డాయి. భారీ ఈదురుగాలులకు  కొన్ని చోట్ల ఇంటి పై కప్పులు లేచిపోయాయి. చాలా చోట్ల పంటలకు నష్టం వాటిల్లింది. ముఖ్యంగా మామిడి పూత రాలిపోవడం తో రైతులు నష్టపోయారు. అయితే ఎంతమేరకు నష్టం వాటిల్లింది ఇంకా తెలియాల్సి ఉంది. కరీంనగర్ జిల్లా గంగాధర మార్కెట్ లో కందులు తడిసిపోయాయి దీనితో రైతులు ఆందోళన చెందుతున్నారు. భారీగా వీచిన గాలుల వల్ల నష్టం ఎక్కువగా ఉందని రైతులు చెప్తున్నారు. అయితే వర్షం కొన్ని ప్రాంతాలకే పరిమితం కావడం వల్ల నష్ట తీవ్రత తక్కువగా ఉంది. వర్షాలతో ఎండ తీవ్రత మరింత పెరిగే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది.

Wanna Share it with loved ones?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here