మోడీ మాటలు ఘనం-ఇచ్చింది శూన్యం

0
54

వివిధ రాష్ట్రాలకు కేంద్రం ప్రకటించిన నిధుల్లో ఒక్కరూపాయి కూడా ఆయా రాష్ట్రాలకు చేరలేదు. సమాచార హక్కు చట్టం కింద ఈ విషయాన్ని స్వయంగా కేంద్ర ఆర్థిక శాఖ వెల్లడించింది. బీహార్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఆ రాష్ట్రానికి 1.25 లక్షల కోట్ల రూపాయల ప్యాకీజీని ఇస్తున్నట్టు ప్రధాని నరేంద్రమోడి ప్రకటించారు.  ప్రధాని హామీ మేరకు ఎంత మేరకు నిధులు విడుదల అయ్యాయ్యే తెలుసుకునేందుకు ముంబాయికి చెందిన అనిల్ గోల్గాలి సమాచార హక్కు చట్టం  ప్రకారం అడిగిన సమాచారం పై కేంద్ర ఆర్థిక శాఖ సమాధానం ఇచ్చింది. బీహార్ కు ప్యాకేజీ కింద ఒక్కరూపాయి కూడా విడుదల చేయలేదని స్పష్టం చేశారు. అయితే బీహార్ కు వివిధ ప్రాజెక్టులకు గాను పెద్ద మొత్తంలో నిధులు ఖర్చు చేసినట్టు వివరించే ప్రయత్నం చేశారు. ప్రధాని మోడీ జమ్మూ కాశ్మీర్ కు ప్రకటించిన 80వేల కోట్ల రూపాయలు, సిక్కింకు ప్రకటించిన 43 వేల కోట్ల రూపాయల ప్యాకేజీలకు సంబంధించి కూడా ఒక్కరూపాయి కూడా విడుదల కాలేదని ఆర్థిక శాఖ తెలిపింది.
ప్రధాని నరేంద్ర మోడీ వివిధ రాష్ట్రాల పర్యటనల్లో ప్రకటించిన భారీ ప్యాకేజీలు వచ్చి మాటలుగానే మిలగడం పై తీవ్ర రాజకీయ దుమారం రేగే అవకాశాలు కన్పిస్తున్నాయి.

Wanna Share it with loved ones?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here