మరో బాంబు పేలుస్తానంటున్న సుచిత్ర

గాయని సుచిత్ర ఇప్పుడు దక్షిణ భారత సినీ పరిశ్రమలో హాట్ టాపిక్ గా మారింది. చిత్ర పరిశ్రమకు చెందిన కొంతమంది ప్రముఖులకు చెందిన వ్యక్తిగత చిత్రాలను తన ట్విట్టర్ లో ఉంచడం ద్వారా సంచలనం రేపిన ఈ గాయని త్వరలోనే మరికొన్ని బాంబులను పేల్చబోతున్నట్టు చెప్పడం  దక్షిణాది తారల గుండెల్లో గుబులు రేపుతోంది. సుచిత్ర లీక్స్ పేరుతో ఆమె ట్విట్టర్ అకౌంట్ ద్వారా విడుదల అయిన ఫొటోలు, వీడియోలు దక్షిణాది చలన చిత్ర పరిశ్రమను ఒక ఊపు ఊపాయి. ఆమె విడుదల చేసిన ఫొటోలు, వీడియోల్లో కొంత మంది చిత్రపరిశ్రమకు చెందిన హీరోలు, హీరోయిన్లు ఒకరితో ఒకరు అత్యంత సన్నిహితంగా ఉన్న చిత్రాలు కావడం ఇంత సంచలనానికి కారణం అవుతోంది. అందులో కొన్ని వీడియోలు, చిత్రాలు అభ్యంతరకరంగా ఉండడం షాక్ కు గురిచేసింది. పూర్తిగా వ్యక్తిగతమైన చిత్రాలు ఇంటర్నెట్ లో హల్ చల్ చేయడంతో సదరు హీరోలు ఖంగుతిన్నారు.
తన వద్ద మరికొన్ని వీడియోలు ఉన్నాయని వాటిని బయటపెడతానంటూ సుచిత్ర చేసిన మరో ప్రకటన ఇప్పుడు మరింత సంచలనం కలిగిస్తోంది. తనకు మత్తుమందు ఇచ్చి తనతో కొంతమంది ప్రముఖులు అత్యంత అభ్యంతరకరంగా ప్రవర్తించారని దాన్ని కూడా బయటపెడతానంటోంది. మరో వైపు డబ్బింగ్ ఆర్టిస్ట్ చిన్మయపై కూడా సుచిత్ర విరుచుకుపడింది. ఆమెకు సంబంధించిన రహస్యాలు కూడా తన వద్ద ఉన్నాయని వాటిని కూడా బయటపెడతానంటోంది.     ఇదంతా సుచిత్ర ఎందుకు చేస్తున్నది అన్న ప్రశ్నకు మాత్రం సమాధానం దొరకడం లేదు. సుచిత్ర మానసిక సమస్యలతో బాధపడుతోందని ఆమె భర్త కార్తిక్ అంటున్నాడు. అయితే  ఈ వాదనలను చిత్రవర్గాలు కొట్టిపారేస్తున్నాయి. ఇప్పటికే కార్తిక్ విడాకుల కోసం దరఖాస్తు కూడా చేశారు. వారిద్దరి మధ్య ఉన్న విభేదాల వల్లే సుచిత్ర మానసిన పరిస్థితి సరిగా లేదనేది మరో వాదన. తన ట్విట్టర్ ఖాతా హ్యాక్ అయిందని తొలుత చెప్పిన సుచిత్ర మాటలు నమ్మెందుకు వీలు లేదని అంటున్నారు. ఆమె ఖాతా హ్యాక్ అయిన దాఖలాలు లేవని చెప్తున్నారు.
సుచిత్ర విడుదల చేసిన చిత్రాలు ఇప్పటికే దుమారం రేపడంతో చిత్రవర్గానికి పెద్దలు రంగంలోకి దిగినట్టు తెలుస్తోంది. ఈ వ్యవహారాన్ని ఇంతటితో వదిలేయాలని లేకపోతే చిత్ర పరిశ్రమ పరువు పూర్తిగా పోవడం ఖాయం అని వారు చెప్పినట్టు సమాచారం. ఇప్పటికే జరగాల్సిన నష్టం జరిగిందని వ్యక్తిగత చిత్రాలు బయటపడడం ద్వారా చిత్రపరిశ్ర పరువు పోయిందని ఇప్పటికైనా మోల్కోకపోతే మరింత నష్టం జరగడం ఖాయం అనుకున్న సినీ పెద్దలు రంగంలోకి దిగి పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. చెన్నైకి చెందిన సుచిత్ర గాయనిగానే కాకుండా ఆర్జెగా,డబ్బింగ్ ఆర్టిస్ట్ గా , రచయిత్రిగా, పేరు సంపాదించుకుంది. చెన్నైలోని ప్రముఖ కాలేజీలో చదువుకున్న సుచిత్ర ఆర్జేగా తన కెరీర్ ను మొదలుపెట్టింది. అక్కడి నుండి నేపధ్య గాయనిగా రంగం ప్రవేశం చేసినా ఆర్జేగా కొనసాగుతూనే ఉంది. తమిళంతో పాటుగా తెలుగు, మళయాళం,కన్నడ చిత్రాల్లో సుచిత్ర 100 కు పైగా పాటలు పాడారు. తెలుగులో ఆమె పాడిన “ఇప్పటికింకా నావయసు” సూపర్ హిట్ అయింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *