28 బంద్ కు టీఆర్ఎస్ దూరం

పెద్ద నోట్ల రద్దు వల్ల సామాన్య ప్రజల ఇబ్బందులను పరిష్కరించడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని ఆరోపిస్తూ విపక్షాలు ఈనెల 28న (సోమవారం) తలపెట్టిన బంద్ లో పాల్గొనడం లేదని టీఆర్ఎస్ స్పష్టం చేసింది. పెద్ద నోట్ల రద్దుకు తాము వ్యతిరేకంగా కాదని అయితే ఈ క్రమంలో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులకు పరిష్కారం చూపాలని మాత్రమే తమ పార్టీ కోరుతోందని ఆ పార్టీ ఎంపీ వినోద్ స్పష్టం చేశారు. పెద్ద నోట్ల రద్దు వ్యవహారంలో కాంగ్రెస్ అనుసరిస్తున్న విధానాన్ని వినోద్ తప్పు పట్టారు. బంద్ వల్ల ప్రయోజనం లేదని ప్రస్తుత పరిస్తితుల్లో బంద్ చేయాల్సిన అవసరం లేదని ఆయన అభిప్రాయపడ్డారు.