వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే రోజాను మరో సంవత్సరం పాటు సస్పెండ్ చేయనున్నారు. విజయవాడలో సమావేశమైన అంధ్రప్రదేశ్ శాసనసభ క్రమశిక్షణ సంఘం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. గత సంవత్సరం అసెంబ్లీలో రోజా అనుచితంగా ప్రవర్తించిందనే కారణంతో ఆమెను సంవత్సరం పాటు సస్పెండ్ చేశారు. రోజాగా తెలుగుదేశం ఎమ్మెల్యే అనిత చేసిన ఫిర్యాదును శాసనసభ క్షమశిక్షణా సంఘం విచారించింది. అనితకు రోజా భేషరుగా క్షమాపణ చెప్పాలంటూ కమిటీ నిర్ణయించింది. అయితే రోజా కమిటీ నిర్ణయాన్ని పాటించకపోవడం వల్ల మరో సంవత్సరం పాటు రోజాను సస్పెండ్ చేయాని క్షమశిక్షణా సంఘం నిర్ణయం తీసుకుంది. కమిటీ ముందు రోజా హాజరు కాకపోవడం పై కూడా కమిటీ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము తీసుకున్న నిర్ణయాన్ని కమిటీ అసెంబ్లీకి తెలియజేయనున్నారు. ఈ నేపధ్యంలో ఈ సమావేశాలకు కూడా రోజా హజరయ్యే అవకాశం లేదు.