తమిళ సినీ నటుల వ్యక్తిగత ఫొటోలు లీక్

0
36

 
తమిళనాడు సినీ పరిశ్రమలో తీవ్ర సంచనలం రేగింది. కొంత మంది తమిళనటులకు చెందిన వ్యక్తిగత ఫొటోలు బయటపడ్డాయి. ఇవి ఆన్ లైన్ లో దర్శనమివ్వడంతో పాటుగా సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా షేర్ కావడం తీవ్ర సంచలనానికి కారణం అయింది. ఈ చిత్రాలన్నీ సినీ గాయని సుచిత్రా కార్తిక్ ట్విట్టర్ ఖాతా నుండి బయటకు వచ్చాయి. అయితే తన ట్విట్టర్ ఖాతా హ్యాక్ అయిందని గుర్తుతెలియని వ్యక్తులు తన ఖాతాను హ్యాక్ చేయడం ద్వారా ఈ చిత్రాలు బయట ప్రపంచానికి వచ్చాయంటూ సుచిత్రా చెప్తుండగా చిత్రసీమలోని కొన్ని గొడవల వల్లే ఈ ఫొటోలు బయటకు వచ్చాయనే ప్రచారం కూడా సాగుతోంది. తమిళ నటులు త్రిష, ధనుష్, అనిరుధ్, హన్సికలతో పాటుగా పలువరి వ్యక్తి గత ఫొటోలు బయటకు వచ్చాయి.  లీక్ అయిన వాటిలో ఒక వీడియో కూడా ఉంది.
గాయని సుచిత్రకు చెందిన ట్విట్టర్ ఖాతా ద్వారా బయటకు వచ్చిన ఫొటోలో చాలా వాటిలో నటుల వ్యక్తిగత ఫొటోలు ఒకరితో ఒకరు చాలా సన్నిహితంగా ఉన్న ఫొటోలు ఉండడంతో ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశమైంది. దీనితో తమిళ సినీ వర్గాల్లో తీవ్ర దుమారం రేపుతోంది. తన ట్విట్టర్ ఖాతాల ద్వారా వచ్చిన ఫొటోలు ఏవీ తన లేవని, వాటిని ఎవరు తన ట్విట్టర్ ఖాతాలో ఉంచారో తెలియదని గాయని సుచిత్ర చెప్తున్నారు. తన ట్విట్టర్ ఖాతాను ఎవరూ ఫాలో కావద్దని కూడా ఆమె పేర్కొన్నారు. అయితే అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. లక్షలాదిగా ఈ ఫొటోలు ప్రజల్లోకి వచ్చేశాయి.
 
 

Wanna Share it with loved ones?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here