బురఖాతో ఎన్నికల్లో అక్రమాలు:బీజేపీ

0
41
    బురఖా వేసుకుని వచ్చి ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడుతున్నట్టు బీజేపీ అనుమానిస్తోంది. ఉత్తర్ ప్రదేశ్ ఎన్నికల్లో బురఖా వేసుకుని వచ్చిన ఓటర్లు పెద్ద సంఖ్యలో ఉంటున్నారని బురఖా వచ్చి అక్రమాలకు పాల్పడుతున్నారనే అనుమానం ఉందని బీజేపీ పేర్కొంది. ఈ మేరకు  ఎన్నికల సంఘానికి బీజేపీ లేఖ రాసింది. బురాఖా వేసుకుని వచ్చే వారి ఐడి కార్డులను పరీశించడానికి గాను ప్రత్యేకంగా మహిళా పోలీసులను నియమించాలని బీజేపీ కోరింది. బురఖా లో వచ్చి బోగస్ ఓట్లు వేస్తున్నారనే అనుమానాలున్నట్టు బీజేపీ తన లేఖలో తెలిపింది. ఇటువంటి అక్రమాలను అరికట్టడం కోసం ఎన్నికల కేంద్రాల వద్ద పెద్ద సంఖ్యలో మహిళా పోలీసులను నియమించాలని కోరింది. పోలింగ్ కేంద్రాల వద్ద భద్రతను కట్టుదిట్టం చేయాలని, అవసరం అయితే పారామిలటరీ బలగాలను రంగంలోకి దింపాలని బీజేపీ కోరింది.  పోలింగ్ కేంద్రాల వల్ల ప్రస్తుతం ఉన్న దానికన్నా అదనంగా భద్రతను పెంచాలని కోరింది. ఉత్తర్ ప్రదేశ్ లో మొత్తం ఏడు దశల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. ప్రస్తుతం ఐదు దశగా పూర్తి కాగా మరో రెండు దశల్లో పోలింగ్ జరగాల్సి ఉంది. ఈ రెండు దశల్లో ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో బీజేపీకి పెద్దగా పట్టున్న ప్రాంతాలు కావనే ప్రచారం జరుగుతోంది.
Wanna Share it with loved ones?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here