రెండు బస్సుప్రమాదాల్లో 40 మందికి గాయాలు

0
50

ప్రకాశం జిల్లా పెద్దచెర్లోపల్లి అలవలపాడు వద్ద పాలేరు బ్రిడ్జి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో 30 మంది విద్యార్థులకు గాయాలయ్యాయి. వీరిని కనిగిరి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు. గాయపడినలో వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం.  తీవ్రంగా గాయపడ్డ ఒకరిని ఒంగోలుకు తరలించారు. ఉలవపాడు మండలం కరేడు ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థులు  మహానంది, యాగంటికి విహార యాత్రకు వెళ్లివస్తుండగా ఈ ప్రామాదం జరిగింది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో మొత్తం 70 మంది ఉన్నట్టు తెలుస్తోంది. విద్యార్థులతో ఉన్న ప్రైవేటు బస్సు కల్వర్టుని ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదానికి కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.
మరోవైపు  నెల్లూరు జిల్లాలో జరిగిన మరో రోడ్డు ప్రమాదంలో 10 మందికి గాయాలు అయ్యాయి. శ్రీసిటీలోని సెల్ ఫోన్ కంపెనీ ఉద్యోగులను తీసుకుని వెళ్తున్న బస్సును విజయవాడ నుండి నెల్లూరు వెళ్తున్న వెంకటేశ్వర ట్రావెల్స్ కు చెందిన బస్సు వెనక వైపు నుండి ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో 10 మందికి గాయాలు అయ్యాయి. వెనక నుండి బస్సు ఢీకొనడంతో ఉద్యోగులతో వెళ్తున్న బస్సు బోల్తా పడింది. గాయపడ్డ వారిలో 8 మంది మహిళలు ఉన్నారు.
 

Wanna Share it with loved ones?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here