కళాశాల నిర్వాకం-పరీక్షకు విద్యార్థినులు దూరం

ఓ కార్పోరేట్ కాలేజీ నిర్వాకం వల్ల 23 మంది విద్యార్థినులు పరీక్ష రాయలేక పోయారు. పరీక్ష కేంద్రాలకు వీరు ఆలస్యంగా రావడంతో వారిని పరీక్ష రాయడానికి అనుమతించలేదు. నిజాం పేటలోని ఓ బాలికల కాలేజీ విద్యార్థినులు 23 మంది పరీక్షకు హాజరు కాలేకపోయారు. వీరందరికీ బాచుపల్లిలోనికాలేజీలో పరీక్ష సెంటర్ పడింది. వీరందరూ రెసిడెన్సియల్ కాలేజీ విద్యార్థులు కావడంతో వీరిని సెంటర్లకు చేర్చే బాధ్యత కూడా కళాశాల యాజమాన్యానిదే అయితే వీరిని తరలించడానికి సరైన ఏర్పాట్లు చేయకపోవడంతో 23 మంది విద్యార్థినులు దాదాపు 40 నిమిషాల ఆలస్యంగా సెంటర్ కు చేరుకున్నారు. నిమిషం అలస్యం అయినా పరీక్షా కేంద్రంలోకి అనుమతి ఇవ్వరాదనే నిబంధన ఉండడంతో వీరిని పరీక్ష రాయడానికి అనుమతించలేదు. పరీక్ష రాయలేక పోయిన 23 మంది విద్యార్థనులు తీవ్రంగా  నిరాశ చెందారు. తమను పరీక్ష రాయడానికి అనుమతించాలంటూ కన్నీటి పర్యంతరం అయ్యారు. అయినా నిబంధనల కారణంగా తాము చేయగలిగింది ఏమీలేదని సెంటర్ నిర్వాహకులు స్పష్టం చేయడంతో వారు ఏడుస్తూ వెనుదిరిగారు. కళాశాల నిర్వాహకుల వల్లే తాము పరీక్షలు రాయలేకపోయామని వాడు ఏడుస్తూ చెప్పారు.
ఒక నిమిషం ఆలస్యం అయినా పరీక్షకు హాజరు కానివ్వరని తెలిసినా నలభై నిమిషాలు విద్యార్థులను ఆలస్యంగా తీసుకుని వచ్చిన  కార్పోరేట్ కళాశాల వైనంపై విమర్శలు వస్తున్నాయి. మరో వైపు రాష్ట్రంలో కొన్ని చోట్ల విద్యార్థులు పరీక్షలకు ఆలస్యంగా వచ్చారు. ఒక నిమిషం నుండి రెండు నిమిషాలు ఆలస్యంగా వచ్చిన వారిని కూడా పరీక్షలకు అనుమతించలేదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *