హైదరాబాద్ లోని ఒక ప్రముఖ స్కూల్ లో పదవ తరగతి చదువుతున్న విద్యార్థినిని కొంత మంది గుర్తుతెలియని వ్యక్తులు హర్యానా రిజిస్టేషన్ ఉన్న వహానంలో కిడ్నాప్ చేశారంటూ ఒక బాలిక ఫొటోతో సహా వాట్సప్ లో చక్కర్లు కొడుతున్న సమాచారం అవాస్తవమని తెలిసింది. ఈ మెసేజ్ వాట్స్ ప్ గ్రూపుల్లో వైరల్ అయింది. నగరంలో ఎక్కడా పదవ తరగతి విద్యార్థిని కిడ్నాప్ కు గురైనట్టు ఎటువంటి సమారం పోలీసులకు లేదు. ఇదే బాలిక ఫొటోతో కిడ్నాప్ కు సంబంధించిన మెసేజ్ వాట్సప్ లో ప్రచారం కావడంతో దీనిపై ఢిల్లీ పోలీసులు స్పందిచారు. కిడ్నాప్ మెసేజ్ పూర్తిగా అబధ్దమని తేల్చిచెప్పారు.
కొంత మంది పనిగట్టుకుని చేస్తున్న ప్రచారం వల్ల అటు పోలీసులతో పాటుగా బాధితులు తీవ్ర ఇబ్బందులకు గరవుతున్నారు. ఇతర వ్యక్తుల ఫోన్ నెంబర్లు, ఫొటోలు పెట్టి చేస్తున్న ప్రచారం వల్ల ఈ ఫొటోలు ఉన్న వారు ఇబ్బంది పడడంతో పాటుగా వారి నెంబర్లకు ఫోన్ల వరద పారుతోంది. ఇటు పోలీసులు కూడా కొన్ని సందర్భాల్లో ఇబ్బందులు పడుతున్నారు. ఇటువంటి అబద్దపు ప్రచారం వల్ల నిజంగా ఏదైనా జరిగినా ప్రజలు స్పందించని పరిస్థితులు ఏర్పడుతున్నాయి.