కేన్సస్ ఘటనపై స్పందించిన ట్రంప్

0
53

సంచలనం రేపిన కేన్సస్ కాల్పుల ఘటనపై అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఎట్టకేలకు స్పందించాడు. కేన్సస్ లో జాతివిధ్వేషంతో ఒక తెల్లజాతీయుడు జరితపిన కాల్పుల్లో హైదరాబాద్ కు చెందిన కూచిభొట్ల శ్రీనివాస్ మృతిచెందగా మరో హైదరాబాదీయుడు అలోక్, కాల్పుల ఘటనలో తెలుగువారిని రక్షించేందుకు ప్రయత్నించిన  అమెరికన్ ఇయాన్ గ్రిలాట్ లు గాయపడ్డ సంగతి తెలిసిందే. కేన్సస్ కాల్పుల ఘటన బాధితులకు అమెరికన్ కాంగ్రెస్ సంపాపం ప్రకటించిన అనంతరం దీనిపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ స్పందించారు. ఇది జాతి జాత్యంహంకార హత్యగా ట్రంప్ అంగీకరించారు.ప్రతీ ఒక్క అమెరికన్ ను కాపాడాల్సిన బాధ్యత తనపై ఉందన్నారు. జాతివివక్షకు అమెరికాలో చోటులేదని ట్రంప్ తేల్చిచెప్పారు. ఈ ఘటన బాధాకరమన్నారు.  అమెరికా అగ్రస్థానంలో ఉంది ఇదే స్థానంలో కొనసాగుతుందని చెప్పారు. ఇటువంటి ఘటనలు జరగడం దురదృష్టకరమన్నారు.
కేన్సస్ కాల్పుల ఘటనపై అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ స్పందించకపోవడంపై అమెరికాతో పాటుగా ప్రపంచ వ్యాప్తంగా దుమారం రేగింది. జాతివివక్ష వల్ల ఒక వ్యక్తి ప్రాణాలు కోల్పోయినా అమెరికా అధ్యక్షుడు స్పందించకపోవడంపై విమర్శలు వచ్చాయి. ట్రంప్ చేస్తున్న విధ్వేష ప్రకటనల వల్లే ఇటువంటి ఘటనలు జరుగుతున్నాయని దీనికి అమెరికా అధ్యక్షుడు బాధ్యత వహించాలని పలువురు డిమాండ్ చేశారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీచేసిన హిల్లరీ క్లింటన్ సైతం ట్రంప్ వ్యవహారశైలిపై మండిపడ్డారు. ఇంతజరిగినా ట్రంప్ స్పందించరా అంటూ విమర్శలు గుప్పించారు. అటు అమెరికా మీడియాలో కూడా దీనిపై పెద్ద ఎత్తున ప్రచారం కావడంతో ఎట్టకేలకు ట్రంప్ స్పందించారు.

Wanna Share it with loved ones?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here