కృష్ణా జిల్లా బస్సు ప్రమాదంలో 11 మంది మృతి

5-dead-and-30-injured-in-a-bus-accident-at-Mulapadu1-e1488253645443-414x510
ఒడిశా రాజధాని భువనేశ్వర్ నుండి హైదరాబాద్ వెళ్తున్న బస్సుకు కృష్ణాజిల్లా పెనుగంచిప్రోలు మండలం ముళ్లపాడు వద్ద ప్రమాదానికి గురైన ఘటనలో  111 మంది మరణించగా 30 మంది గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన ఘటనా స్థలంలోనే 8 మంది చనిపోగా మరో ముగ్గురు ఆస్పత్రిలో కన్నుమూశారు.     కృష్ణా జిల్లాలలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదానికి డ్రైవర్ నిద్రమత్తే కారణంగా పోలీసులు భావిస్తున్నారు. భువనేశ్వర్ నుండి హైదరాబాద్ కు వెయి కిలోమీటర్లకు పైగా దూరం ఉంది. ఇంత దూరం ఒకే డ్రైవరు నడుపుతున్నాడా ఇంకో డ్రైవరు ఉన్నాడా అనే దాన్ని పోలీసులు పరిశీలిస్తున్నారు.  ఈ ప్రమాదంలో బస్సు పూర్తిగా నుజ్జు నుజ్జయింది. వంతెనపై ముందుగా డివైడర్ ను ఢీకోని ఆ తరువాత కల్వర్టు మధ్యన బస్సు ఇరుక్కుపోయింది. డ్రైవర్ నిద్రతో పాటుగా బస్సు ప్రమాదం జరిగిన సమయంలో అత్యంత వేగంగా వస్తున్నట్టు తెలుస్తోంది. ప్రమాదంలో గాయపడ్డవారిలో కొంతమంది పరిస్థితి ఆందోళన కరంగా ఉండడంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. దివాకర్ ట్రావేల్స్ కు చెందిన ఈ ఓల్వో బస్సులో మొత్తం 44 మంది ప్రయాణికులు ఉన్నట్టు తెలుస్తోంది.
ప్రమాదంలో గాయపడిన వారిని నందిగాల ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులకు తరలించారు.  తీవ్రంగా గాయపడిన వారిని విజయవాడకు తరలించారు. కృష్ణా జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం పై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో గాయపడ్డ వారికి మెరుగైన చికిత్సను అందచేయాలని చంద్రబాబు నాయుడు ఆదేశించారు. మరో వైపు ప్రమాదానికి కారణమైన దివాకర్ ట్రావెల్స్ పై పోలీసులు కేసును నమోదు చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *