టెలికాం రంగంలో నెలకొన్న తీవ్రమైన పోటీ వినియోగదారులకు లభసాటిగా మారుతోంది. ప్రముఖ టెలికాం సంస్థ ఎయిర్ టెల్ భారీ నిర్ణయం తీసుకుంది. కాల్స్, ఎస్ఎంఎస్, డేటా లపై రోమింగ్ ఛార్జీలను ఎత్తివేయాలని ఎయిర్ టెల్ నిర్ణయించుకుంది. ఎప్రిల్ 1వ తేదీ నుండి ఇది అమల్లోకి వస్తుంది. అంటే ఎప్రిల్ 1వ తేదీ నుండి కాల్స్,ఎస్ఎంఎస్, డేటాలపై ఎటువంటి రోమింగ్ ఛార్జీలు ఉండవు. దీనివల్ల వినియోగ దారుడికి భారగా లాభం కలుగుతుంది. టెలికాం రంగంలోకి జియో ప్రవేశించిన తరువాత ఈ రంగంలో విపరీతమైన పోటీ నెలకొంది. వినియోగ దారులను ఆకట్టుకునేందుకు టెలికాం సంస్థలు పోటీపడుతున్నాయి. ఇప్పటికీ ఉచిత కాల్స్, 4జీ డేటాలతో రియలన్స్ జియో సంస్థ వినియోగదారులను తన వైపు తిప్పుకోవడంతో ఇప్పటివరకు టెలికాం రంగంలో నెంబర్ వన్ గా ఉన్న ఎయిర్ టెల్ తన స్థానాన్ని పదిల పర్చుకోవడం కోసం నానా పాట్లు పడుతోంది.ఇందులో భాగంగానే రకరకాల ఆఫర్లతో వినియోగ దారులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్న ఎయిర్ టెల్ తాజాగా రోమింగ్ ఛార్జీలను ఎత్తివేస్తూ భారీ నిర్ణయం తీసుకుంది.