మహిళ కోరికను మన్నించిన ప్రధాని

   shilpi1
     సామాజిక మాధ్యమాల్లో చురుగ్గా ఉండే ప్రధాని మోడీ ట్విట్టర్ లో ఒక మహిళ చేసిన విజ్ఞప్తికి వెంటనే స్పందించి ఆమె కోరికను తీర్చేశారు. వివరాల్లోకి వెళ్తే శివరాత్రి పర్వదినం సందర్భంగా ప్రధాన మంత్రి కోయంబత్తూరులోని ఈశా ఫౌండేషన్ సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మెడలో వేసుకున్న స్కార్ఫ్ శిల్పి తివారి అనే మహిళకు తెగనచ్చేసిందట. దీనితో ఆ స్కార్ఫ్ ను తనకు ఇవ్వాల్సిందిగా సదరు మహిళ ట్విట్టర్ లో ప్రధానికి విజ్ఞప్తి చేసింది. దీనిపై వెంటనే స్పందిచిన ప్రధాని ఆమె ట్విట్టర్ లో చేసిన విజ్ఞప్తిని ప్రింట్ తీయించి దానిపై తన ఆటో గ్రాఫ్ ఉంచి మరీ స్కార్ఫ్ ను ఆమెకు పార్శిల్ చేశారు. ప్రధాని కార్యాలయం నుండి అందిన ఈ పార్శిల్ ను చూసిన ఆ మహిళ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. తాను కేవలం ట్విట్టర్ చేసిన విజ్ఞప్తికి ప్రధాని స్పందించడం తనకు చాలా ఆనందంగా ఉందంటూ సదరు మహిళ తనకు అందిన స్కార్ఫ్ ను మెడలో వేసుకుని ప్రధాని పంపిన ఆటోగ్రాఫ్ ను చేతబట్టుకుని తీయించుకున్న ఫొటోలు ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. తన కోరికను ప్రధాని మన్నించడంతో శిల్పి అనే మహిళకు నోట మాట రావడం లేదట. తాను ఆనందంతో తబ్బిఉబ్బవుతున్నానంటూ ఆమె వ్యాఖ్యానించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *