తనను రేప్ చేస్తామంటూ బెదిరింపులు వస్తున్నాయని ఢిల్లీలోని ప్రఖ్యాత రాంజాస్ కళాశాల విద్యార్థిని గుర్ మోహర్ కౌర్ అంటున్నారు. కళశాలలో ఏబీవీపీకి, ఇతర విద్యార్థి సంఘాలకు మధ్య జరుగుతున్న వివాదంలో ఏబీవీపీకి వ్యతిరేకంగా తాను మాట్లాడినందుకు తనను వేధిస్తూ బెదిరింపులకు దిగుతున్నారని ఆ విద్యార్థని వాపోయారు. ఏబీవీపీ కి వ్యతిరేకంగా ఫేస్ బుక్ లో కౌర్ ఒక పోస్ట్ చేశారు. ఏబీవీపీ అంటే తనకు భయం లేదని, దేశంలోని విద్యార్థులంతా తనకు అండగా ఉన్నారంటూ ఆమె ప్లకార్డును ప్రదర్శిస్తూ చేసిన పోస్టు సంచలనం రేపింది. దీనితో తనను చంపుతామని, రేప్ చేస్తామంటూ బెదిరింపులు వచ్చాయని ఒకరైతే ఏ విధంగా రేప్ చేయాలనుకుంటున్నది వివరిస్తూ చేసిన పోస్టు తనను భయాందోనళకు గురించేసిందని ఆ విద్యార్థిని అంటోంది. 1999 కార్గిల్ యుద్ధంలో మరణించిన కెప్టెన్ మన్ దీప్ సింగ్ కుమారై అయిన కౌర్ ఏబీవీపికి వ్యతిరేకంగా పనిచేస్తున్నారు.
తనను దేశద్రోహిగా పేర్కొంటూ చాలా మంది పోస్టులు చేశారని ఏబీవీపీని వ్యతిరేకించినంత మాత్రాన తాను దేశ ద్రోహిని అవుతానా అంటూ కౌర్ ప్రశ్నించారు. సామాజిక మాధ్యమాల ద్వారా తనకు బెదిరింపులు వస్తున్నాయని ఆమె అంటున్నారు. ఒక సైనికుడి కూతురుగా తాను ఇటువంటి వాటికి భయపడనని అంటున్నారు. ఢిల్లీలో ప్రఖ్యాత రాంజాస్ కళాశాలలో యుద్ధ వాతావరణం నెలకొంది. విద్యార్థులతో పాటుగా అధ్యాపకులు కూడా రెండు గ్రూపులుగా విడిపోయారు. ఏబీవీపీ అనుకూల వ్యతిరేక వర్గాలుగా విడిపోయిన విద్యార్థి గ్రూపుల మధ్య ఘర్షణలు సాధరణం అయ్యాయి.