ప్రజల సొమ్ముతో సీఎం విలాసాలు:ఉత్తమ్

ప్రజల సొమ్ముతో చార్టెడ్ విమానాల్లో తిరుగుతున్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెడుతున్నాడని తెలంగాణ  కాంగ్రెస్ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. కోట్లాది ప్రజాధనాన్ని మొక్కుల పేరుతో ఖర్చుచేయడాన్ని తప్పుబడితే సన్నాసులు అంటూ వ్యాఖ్యానించడాన్ని ఆయన తప్పుబట్టారు. కేసీఆర్ మొక్కులపేరుతో ప్రజల ధనాన్ని ఇష్టం వచ్చినట్టు ఖర్చు చేసింది నిజంకాదా అని ప్రశ్నించారు. విమానంలో విలాసాలు చేయడం దారుణమన్నారు.
ఆంధ్రా ప్రాంతానికి చెందిన కాంట్రాక్టర్లకు లబ్ది చేకూర్చడానికే సాగునీటి ప్రాజెక్టుల డిజైన్ లను మారుస్తున్నారని ఉత్తమ్ కుమార్ రెడ్డి మండిపడ్డారు. వేలాది కోట్ల రూపాయలు వారికి దోచిపెడుతున్నారని అన్నారు. అంధ్రా ప్రాంత కాంట్రాక్టులకు రాష్ట్రాన్ని దోచిపెడుతున్నారని ఆరోపించారు. వారి కోసమే ప్రాజెక్టుల డిజైన్లను మారుస్తున్నారని అన్నారు. దీనిపై చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉందా అని ఉత్తమ్ సవాల్ విసిరారు. కేసీఆర్ ప్రభుత్వం కమీషన్ల కోసం కక్కూర్తి పడి ప్రాజెక్టు డిజైన్లను మారుస్తోందని దీనిపై సర్కారును నిలదీస్తే విపక్షాలపై ఎదురుదాడి చేస్తూ నోరు మూయిస్తున్నారని ఉత్తమ్ మండిపడ్డారు. కేసీఆర్ ముఖ్యమంత్రి స్థాయికి చెందిన వ్యక్తిగా కాకుండా గల్లీ లీడర్ లాగా మాట్లాడుతున్నారని అన్నారు. ఆయన స్థాయికి తగ్గట్టుగా మాట్లాడాలని సూచించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో వచ్చిన తరువాత రాష్ట్రంలో ఏం అభివృద్ది కార్యక్రమాలను నిర్వహించిందో చెప్పాలని ఉత్తమ్ సవాల్ విసిరారు. కేవలం మాటలతో కాలం గడుపుతున్న కేసీఆర్ మాటలతో కోటలు కడుతున్నారని అన్నారు.
 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *