అమెరికా వదిలి పోవాల్సిందేనా…

అమెరికాలో పనిచేస్తున్న వారంతా ఈ దేశానికి చెందిన వారేనా… వాళ్లు ఇక్కడ ఉండి పనిచేసుకోవచ్చా… దేశంలో మైనార్టీల పరిస్థితి ఏంటి… వారు దేశం విడిచి వెళ్లిపోవాల్సిందేనా… అంటూ తెల్లజాతి జాత్యహంకారి చేతిలో ప్రాణాలు కోల్పోయిన శ్రీనివాస్ సూచిభొట్ట భార్య సునయన ప్రశ్నించారు. కాల్పుల్లో మృతి చెందిన శ్రీనివాస్ పనిచేస్తున్న కంపెనీ గార్మన్ ఏర్పాటు చేసిన మిడియా సమావేసంలో ఆమె మాట్లాడారు. అమెరికాలో జరుగుతున్న పరిణామాలను గురించి తాను తన భర్త అనేక సార్లు చర్చించుకున్నామని దేశం విడిచి స్వదేశానికి వెళ్లడం గురించి కూడా చర్చించినా అనవసరంగా భయపడవద్దని తన భర్త తనకు అనేక సార్లు ధైర్యం చెప్పెవారని సునయని కన్నీటి పర్యంతరం అయ్యారు. ఏవియేషన్ రంగంపై విపరీతమైన మక్కువ ఉన్న శ్రీనివాస్ ఆ రంగంలో ఉన్నత శిఖరాలను అదిరోహించాలని కలలు కన్నాడని చెప్పారు. మంచిగా ఆలోచిస్తే అంతా మంచే జరుగుతుందని గట్టిగా నమ్మె శ్రీనివాస్ ఎవరికీ ఎటువంటి హానీ చేయలేదని అయినా ఆయన బలైపోయాడని ఆవేదన చెందారు. అమెరికాలో ఉన్న మైనార్టీలకు బాసటగా ఉండేందుకు అమెరికా ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంటోంది అన్న విషయం తనకు తెలియాలని అన్నారు. ఇటువంటి ఘటనలు పునరావృత్తం కాకుండా చర్యలు తీసుకోవాలని ఆమె అన్నారు. విద్వేష హత్యలు జరగడం పై ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఇంత దారుణమైన ఘటనలు జరుగుతుందని తాము ఊహించలేదన్నారు. అటు శ్రీనివాస్ మృత దేహాన్ని స్వదేశానికి పంపడం కోసం ఏర్పాట్లు జరుగుతున్నాయి.
మరో వైపు శ్రీనివాస్ మృతికి ట్రంప్ వ్యాఖ్యలకు ఎటువంటి సంబంధం లేదని వైట్ ప్రతినిధులు వెల్లడించారు. ఎవరి ప్రాణాలు పోయినా బాధాకరమని వైట్ హౌస్ ప్రతినిధి తమ సందేశంలో పేర్కొన్నారు. శ్రీనివాస్ హత్యకు ట్రంప్ చేస్తున్న వ్యాఖ్యలకు ముడిపెట్టడం సరికాదని వైట్ హౌస్ ప్రతినిధి అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *