చాపచుట్టేసిన టీమిండియా

ఆస్ట్రేలియాతో పుణేలో జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్ లో భారత్ తన తొలి ఇన్నింగ్స్ లో   చాపతచుట్టేసింది. 40.1 ఓవర్లలో 105 పరుగులకు ఆలౌట్ అయింది. అంతుకు ముందు 260 పరుగులకు ఆస్ట్రేలియాను ఆలౌట్ చేసిన భారత్ కు ఆ ఆనందం ఎక్కువ సమయం మిగలలేదు. స్పీన్ కు సహకరిస్తున్న పిచ్ పై ఆస్ట్రేలియా బౌలర్లు రెచ్చిపోయారు.  ముఖ్యంగా ఓకీఫ్ ఆరు వికెట్లు తీసి భారత్ ను కోలుకోలేని దెబ్బతీశారు. భారత ఇన్నింగ్స్ లో ఓపెనర్ లోకేశ్ (64) మినహా మిగిలిన వారెవ్వరూ రాణించలేదు. భారత్ 9 పరుగుల తేడాతో ఏడు వికెట్లను కోల్పోయింది. కెప్టెన్ విరాట్ కోహ్లీ డకౌట్ కాగా వృద్ధిమాన్ సాహా కూడా కెప్టెన్ ను అనుసరించాడు. రహానే-13, విజయ్-10,పుజారా -6, అశ్విన్-1, ఉమేశ్ యాదవ్-4, రవీంద్ర జడేజా-2, జయంత్ యాదవ్-2 పరుగులు చేశారు. తడబడుతూ సాగిన భారత తొలి ఇన్నింగ్స్ లో బ్యాట్స్ మెన్ అసలు ప్రతిఘటించలేకపోయారు. ఓపెనర్ లోకేశ్ పోరాట పటిమతో భారత్ ఆ స్కోర్ అయినా సాధించగలిగింది. భారత్ 105 పరుగులకే ఆలౌట్ కావడంతో ఆస్ట్రేలియాకు మొదటి ఇన్నింగ్స్ లో కీలకమైన 155 పరుగులు ఆధిక్యం లభించింది. రెండో ఇన్నింగ్స్ లో ఆస్ట్రేలియా కూడా తడబడుతూనే ఆరంభించింది. 46 పరుగులకే రెండు వికెట్లను కోల్పోయింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *