ముంబైలో హోరా హోరీ

దేశంలోనే అత్యంత ధనికమైన ప్రతిష్టాత్మక ముంబై కార్పోరేషన్ ఎన్నికల్లో ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ రాలేదు. మొత్తం 227 స్థానాలున్న ముంబై కార్పోరేషన్ లో 226 స్థానాలకు గాను శివసేన 84 డివిజన్లను కైవసం చేసుకుంది. బీజేపీ ఇక్కడ పుంజుకుని 81 స్థానాల్లో జయకేతనం ఎగురవేసింది. శివసేన, బీజేపీలు వేర్వేరుగా పోటీ చేయడం తమకు లాభిస్తుందని ఆశించిన కాంగ్రెస్ పార్టీకి ఆశాభంగం ఎదురైంది. ఆ పార్టీ కేవలం 31 స్థానాలతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఎన్సీపీ 9 స్థానాలకు పరిమింతం కాగా ఈ ఎన్నికల్లో తిరుగులేని శక్తిగా అవతరిస్తామంటూ ఊదరగొట్టిన మహారాష్ట్ర నవ నిర్మాణ్ సేన (ఎంఎన్ఎస్) 7 స్థానాలతో తృప్తి  చెందాల్సి వచ్చింది. ఇక ఇతరులు 13 స్థానాల్లో విజయం సాధించారు.
మహారాష్ట్రలో మిత్ర పక్షాలుగా ఉన్న బీజేపీ, శివసేనలు ఈ ఎన్నికల్లో ఎవరకి వారుగా పోటీ చేశారు. ఒకరి పై ఒకరు తీవ్ర స్థాయిలో విమర్శలు సంధించుకున్నారు. ఎవరికి వారు గెలుపై ధీమా వ్యక్తం చేసిన ఆఖరికి ఎవరికీ మెజార్టీ దక్కని పరిస్థితి ఏర్పడింది. 226 డివిజన్లకు గాను 84 డివిజన్లలో గెలుపొందిన శివసేన కానీ, 81 స్థానాలను సంపాదించుకున్న బీజేపీ గాను సొంతంగా కార్పోరేషన్ ను కైవసం చేసుకునే స్థితిలో లేవు. మెజార్టీకి 114 సీట్లు కావాల్సి ఉండగా శివసేనకు 20 డివిజన్లు తగ్గగా బీజేపీకి 23 డివిజన్లు తగ్గాయి. ఈ నేపధ్యంలో ఇతర పార్టీల మద్దకు తప్పని సరి అయిన పరిస్థితి ఏర్పడింది.
ముంబై కార్పోరేషన్ లో మెజార్టీని సంపాదించుకోలేకపోయిన అత్యధిక స్థానాలను కైవసం చేసుకున్న పార్టీగా తాము కార్పోరేషన్ లో పాగా వేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు శివసేన అధినేత ఉద్దవ్ థకరే ప్రకటించారు. పొత్తులపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని దానికి ఇంకా తొందర లేదని ఆయన అంటున్నారు. ఇటు బీజేపీ కూడా శివసేనతో జట్టు కట్టేందుకు ఎటువంటి అభ్యంతరాలు లేవనే సందేశాలు పంపుతోంది. శివసేనది కూడా మా రక్తమే అంటూ బీజేపీ నేతలు చేస్తున్న ప్రకటనలే ఇందుకు నిదర్శనంగా కనిపిస్తున్నాయి.
మరో వైపు కాంగ్రెస్ పార్టీ ముంబాయిలో ఘోరంగా దెబ్బతినడంతో ఆ పార్టీ కార్యకర్తలు తీవ్ర నిరాశలో మునిగిపోయారు. బీజేపీ, శివసేనలు ఎవరికి వారుగా పోటీ చేస్తుండడం తమకు లాభిస్తుందని ఆ పార్టీకి ఆశించిన ఫలితాలు దక్కలేదు. కేవలం 31 డివిజన్లకే కాంగ్రెస్ పార్టీ పరిమితం కావాల్సి వచ్చింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *