పుణేలో జరుగుతున్న భారత్-ఆస్ట్రేలియాల తొలి టెస్టుమ్యాచ్ తొలి రోజు భారత్ ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. తొలి రోజు అట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా 9 వికెట్లు కోల్పోయి 256 పరుగులు చేసింది. ఆరంభంలో నిలకడగా ఆడిన ఆస్ట్రేలియా ఆ తరువాత క్రమంగా వికెట్లు కోల్పోతూ వచ్చింది. ఆసిస్ జట్టులో ఓపెనర్ మాట్ రెన్షా(68), మిచెల్ స్టార్క్(57నాటౌట్) ల పోరాటంతో ఆస్ట్రేలియా ఈ స్కోరైనా చేయగలిగింది. చివరలో స్టార్క్ అద్బుతమైన ఆటతీరుతో అదరగొట్టడంతో 250 పరగులు దాటడం కష్టం అనుకున్న ఆసిస్ జట్టు 9వికెట్లకు 256 పరుగుల స్కోర్ చేసింది. భారత పేసర్ ఉమేశ్ కుమార్ నాలుగు వికెట్లు తీసి ఆస్ట్రేలియాను దెబ్బకొట్టాడు. అశ్విన్, జడేజా లు చెరో రెండు వికెట్లు తీసుకున్నారు.