తెలుగులో పలు చిత్రాల్లో నటించిన మళయాళి సినీ నటి భావనను లైంగికంగా వేధించిన ఘటన కేరళలోని ఎర్నాకుళంలో జిల్లాలో జరిగింది. నటిని కిడ్నాప్ చేసిన వ్యక్తులు ఆమెను కదులుతున్న కారులోనే లైంగికంగా వేధింపులకు గురిచేయడంతో పాటుగా ఈ దృశ్యాలను వీడియో తీశారు. ఈ చర్యకు పాల్పడింది భావన మాజీ కారు డ్రైవర్లుగా పోలీసులు గుర్తించారు. గతంలో భావన వద్ద కారు డ్రైవర్లుగా పనిచేసిన మార్టిన్, సునీల్ లు భావనను లైంగికంగా వేధించారని పోలీసులు తెలిపారు. వీరిలో మార్టిన్ పోలీసుల అదుపులో ఉన్నారు. మరో నిందితుడు సునీల్ పరారీలో ఉన్నారు. పోలీసుల కథనం ప్రకారం షూటింగ్ పూర్తిచేసుకుని కారులో వెళ్తున్న భావనను అడ్డగించిన మార్టిన్, సునీల్ లు కారులోనే ఆమెను లైంగికంగా వేధింపులకు గురిచేశారు. దాదాపు గంటసేపు కారులో తిప్పుతూ ఆమెను వేధించినట్టు పోలీసులకు ఫిర్యాదు అందింది. భావన తెలుగులో నిప్పు, హీరో, మహాత్మ, ఒంటరి సినిమాల్లో నటించగా పలు మళయాళి చిత్రాల్లోనూ నటించింది.