అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళకు మరో ఎదురుదెబ్బ తగిలింది. సుప్రీం కోర్టు విధించిన నాలుగు సంవత్సరాల జైలు శిక్ష అమలుకు నాలుగు వారాల గడువు కోరుతూ శశికళ చేసిన విజ్ఞప్తిని సుప్రీం కోర్టు తిరస్కరించింది. తన ఆరోగ్యం సరిగా లేనందున తాను లొంగిపోయేందుకు నాలుగు వారాల గడువు కావాలని శశికళ కోరగా దానికి సుప్రీం కోర్టు నిరాకరించింది. తీర్పులో ఎటువంటి మార్పు లేదని చెప్తూ వెంటనే కోర్టులో లొంగిపోవాలని సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీనితో నాలుగు వారాల గడువు కోసం శశికళ చేసిన ప్రయత్నాలు ఫలించకపోవడంతో వెంటనే ఆమె బెంగళూరు కోర్టులో లొంగిపోవాల్సి ఉంది.
సుప్రీం కోర్టు తాజా నిర్ణయంతో శశికళ ఎప్పుడు కొర్టు ముందు లొంగిపోతారనేది ఆశక్తికరంగా మారింది. గడువు కోసం చేసిన ప్రయత్నాలు ఫలించకపోవడంతో వెంటనే కోర్టులో లొంగిపోవాల్సి ఉన్నందున శశికళతో పాటుగా అమె సమీప బంధువులు ఇళవరసి, దినకర్ లు కూడా కోర్టులో లొంగిపోవాల్సి ఉంది. ఈ ఉదయం వీరు బెంగళూరు కోర్టులో లొంగిపోతారని భావించినప్పటికీ గడువు కోరుతూ సుప్రీం కోర్టును ఆశ్రయించారు. అయితే వీరి కోరికను సుప్రీం కోర్టు తిరస్కరించింది.