సరిహద్దుల్లో భారీ సొరంగం

పాకిస్థాన్ నుండి భారత్ లోకి ఉన్న భారీ సొరంగాన్ని భారత భద్రతా బలగాలు కనుగొన్నాయి. పాకిస్థాన్ భూబంగం నుండి భారత్ వైపు తవ్విన ఈ సొరంగం 20 మీటర్లకు పైగా పొడవున్నట్టు సరిహద్దు భద్రతా దళం గుర్తించింది. రెండున్నర అడుగుల ఎత్తు, రెండున్నర అడుగల వెడల్పుతో ఉన్న సొరంగాన్ని సాంభా జిల్లాలో గుర్తించినట్టు బీఎస్ఎఫ్ వర్గాలు వెల్లడించాయి. సరిహద్దు భద్రతా దళం నిర్వహించే సాధారణ తనిఖీల్లో ఈ సొరంగం బయటపడిందని బీఎస్ఎఫ్ డిప్యూటీ ఇన్పెక్టర్ జర్నల్ ధర్మేంద్ర వెల్లడించారు. రాంఘర్ సెక్టర్ లో ఈ సొరంగాన్ని తవ్వారని సరిహద్దుల్లో ఉన్న కంచేకు కిందనుండి ఈ సొరంగం భారత భూభాగంలోకి వచ్చిందని ఆయన వెల్లడించారు. ఈ మార్గం గుండా అక్రమంగా పాకిస్థాన్ నుండి భారత్ కు వస్తున్నారని చెప్పారు. తీవ్రవాదులతో పాటుగా అక్రమ వ్యాపారులు కూడా ఈ సొరంగ మార్గాన్ని వినియోగించి ఉంటారని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. దీన్ని తవ్వి ఎన్ని రోజులు అయింది, ఎంత మంది ఈ మార్గం గుండా భారత్ లోకి ప్రవేశించారు అనే దానిపై విచారణ జరుగుతోందని ఆయన చెప్పారు. సొరంగ మార్గాన్ని గుర్తించిన వెంటనే దాన్ని మూసివేశామని చెప్పారు. దీన్ని తవ్వి ఎక్కువ రోజులు కాకపోయి ఉండవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *