పోలీసుల్లో నయీం దోస్తులేవరు

     కరడుగట్టిన నేరగాడు నయీంతో సంబంధాలు ఉన్న పోలీసుల వివరాలు ఇప్పటికైనా ప్రభుత్వం బయటపెట్టాలని సీపీఐ నేత నారాయణ డిమాండ్ చేశారు. ఈ మేరకు నారాయణ తెలంగాణ హోం మంత్రి నాయిని నర్సింహ్మారెడ్డికి ఒక లేఖను రాశారు. నయీంతో సన్నిహితంగా ఉన్న కొందరు పోలీసులకు సంబంధించిన ఫొటోలు బయటకు వచ్చిన నేపధ్యంలో వీటిపై సమాధానం చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉందని నారాయణ అన్నారు. ఇప్పటికే నయీంతో పోలీసులకు, రాజకీయ నేతలకు ఉన్న సంబంధాలపై వాస్తవాలను తెలియెచెప్పేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ హైకోర్టులో పిటీషన్ వేసిన నారాయణ తాజాగా హోం మంత్రికి మరో లేఖ రాశారు. నయీం కేసు విచారణ వివరాలను వెల్లడించాలని నారాణయ కోరారు. దీనిపై తనకు గానీ కోర్టుకు గానీ సమాచారం ఇవ్వాలని కోరారు. నయీం కేసును తెలంగాణ ప్రభుత్వం నీరుగార్చే ప్రయత్నాలను చేస్తోందని నారాయణ ఆరోపిస్తున్నారు. అనేక దారుణాలకు ఒడిగట్టిన నయీం కు సంబంధించిన పూర్తి వాస్తవాలు వెలుగులోకి రావాలంటే సీబీఐ తో విచారణ జరిపించాలని నారాయణ డిమాండ్ చేశారు.
గ్యాంగ్ స్టర్ నయీం చేసిన అరాచాలు చాలా ఉన్నాయని అవన్నీ వెలుగులోకి రావాలంటే సీబీఐ విచారణ ఒక్కటే మార్గమని నారాయణ అంటున్నారు. నయీం అరాచకాలకు సంబంధించి వాస్తవాలు ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కేసులో విచారణకు సంబంధించిన విషయాలను బయటపెట్టాలని డిమాండ్ చేశారు. నయీం కేసును అడ్డంపెట్టుకుని టీఆర్ఎస్ ప్రభుత్వం రాజకీయ ప్రయోజనాలకు పొందేందుకు ప్రయత్నిస్తున్నట్టు నారాయణ ఆరోపిస్తున్నారు. రాజకీయంగా తన ప్రత్యర్థులను దెబ్బతీసేందుకు కేసీఆర్ నయీం అస్త్రాన్ని ఉపయోగించుకుంటోందని నారాయణ ఆరోపించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *