పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొత్త చిత్రం “కాటమరాయుడు” చిత్రం టీజర్ విడుదల అయింది. ఈ టీజర్ పవన్ అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ” ఎంత మంది ఉన్నారన్నది ముఖ్యంకాదు… ఎవడు ఉన్నాడన్నది ముఖ్యం” అంటూ పవర్ స్టార్ చెప్పిన డైలాగ్స్ ఆకట్టుకుంటున్నాయి. తమ అభిమాన కథనాయకుడు చెప్పిన డైలాగ్స్ పవన్ ప్యాన్స్ లో ఉత్సాహాన్ని నింపుతున్నాయి. టీయర్ లో డైలాగ్స్ తో పాటుగా వెనకు రాయుడూ అంటూ వచ్చిన మ్యూజిక్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. “కాటమరాయుడు” చిత్రాన్ని ఉగాదికి విడుదల కానున్న ఈ చిత్రంలో శృతిహాసన్ పవన్ కళ్యాణ్ కు జోడీగా నటిస్తున్నారు. కిశోర్ కుమార్ దర్శకత్వంతో లో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రానికి నిర్మాత శరత్ మరార్.