తప్పిపోయి వేటగాళ్లకు చిక్కిన బాలిక

 
తప్పిపోయి ఢిల్లీకి చేరుకున్న ఓ బాలిక దుండగుల దారుణాలకు బలైంది. బాలికపై అత్యాచారం చేయడంతో పాటుగా ఆమెను వ్యభిచార ముఠాకు అమ్మిన వైనం వెలుగులోకి వచ్చింది. బాలికను వంచించిన ముఠాలో ఒక మహిళ కూడా ఉండడం విశేషం. అతి కష్టం మీద సదరు బాలిక ఒక వ్యక్తి సహాయంతో పోలీసులను ఆశ్రయించింది. ప్రస్తుతం ఆ బాలిక ఎయిమ్స్ లో చికిత్స పొందుతోంది. బాలిక ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందని పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేయగా మరో ఇద్దరు పరారీలో ఉన్నారు.
చత్తీస్ ఘడ్ కు చెందిన 15 సంవత్సరాల బాలిక బంధువుల ఇంటికి వెళ్లడానికి ట్రైన్ ఎక్కి ఢిల్లీకి చేరుకుంది. అక్కడ తప్పిపోయిన ఆ బాలిక తప్పిపోయిన విషయాన్ని గమనించిన వ్యక్తి సదరు బాలికను తన ఇంటికి తీసుకుని వెళ్లాడు. అక్కడ భార్య సహాయంతో బాలికపై అత్యాచారం చేశాడు. బాలికపై అత్యాచారానికి నిందితుడి భార్య హసీనా సహకరించిందని పోలీసులు తెలిపారు. పలు మార్లు బాలికపై అత్యాచారం చేసిన తరవాత బాలికను పప్పూయాదవ్ అనే వ్యక్తికి 70వేల రూపాయలకు విక్రయించాడు. పప్పూయాదవ్ కూడా బాలికపై పలుమార్లు లైంగిక దాడిచేయడంతో పాటుగా ఆమెను తీవ్రంగా హింసించాడు. అతి కష్టంమీద బాలిక పప్పుయాదవ్ చెరనుండి తప్పించుకుని రైల్వే స్టేషన్ కు చేరుకున్నప్పటికీ ఫలితం లేకుండా పోయింది. అక్కడ హసీనా కంటపడిన బాలికకు బలవంతంగా మత్తు మందు కలిసి కూల్ డ్రింగ్ తాగించిన హసీనా బాలికను మహ్మద్ అర్ఫోజ్ అనే వ్యక్తికి అప్పగించింది. అర్పోజ్ కు బాలికపై బలాత్కారానికి పాల్పడ్డాడు. రైల్వే స్టేషన్ వద్ద నిస్సహాయంగా కనిపించిన బాలికను చేరదీసిన ఒక వ్యక్తిపోలీసులకు సమాచారం అందచేయడంతో ఈ వ్యవహారం మొత్తం బయటికి వచ్చింది. ఇప్పటివరకు బాలికపై అత్యాచారానికి పాల్పడ్డ పప్పూయాదవ్, అర్ఫోజ్ లను పోలీసులు అరెస్టు చేశారు. హసీనా, అమె భర్త పరారీలో ఉన్నారని వారిని త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *