పప్పీసార్ హత్య కేసులో మామే అసలు నిందితుడు…

హైదరాబాద్, దిల్ షుఖ్ నగర్ లో నుండి ఉదృశ్యమై హత్యగురైన వి.ప్రభాకర్ అలియాస్ పప్పీసార్ ను నయీం ముఠ హత్యచేసినట్టుగా పోలీసులు నిర్థారించారు. అయితే నయీంకు పప్పీని హత్యచేయాల్సిన అవసరం ఏంముంది అనే దానిపై విచారణ జరిపిన పోలీసులు వి.ప్రభాకర్ అలియాస్ పప్పీ మామ దొంతుల రాములు అలియాస్ కోళ్ల రాములు అలియాస్ గుడ్ల రాములును ఈ కేసులో ప్రధాన నిందితుడిగా తేల్చారు.  రాములు నయీం ముఠాను సంప్రదించి ప్రభాకర్ ను హత్యచేయించినట్టు పోలీసులు వెల్లడించారు. ప్రభాకర్ ను చంపితే రాములు ఇస్తాన్న పైకానికి ఆశపడ్డ నయీం ముఠా ఈ కిరాయి హత్యకు ఒప్పుకుంది. నయీం అతని అనుచరులు  దిల్ షుఖ్ నగర్ నుండి లెక్చరర్ ప్రభాకర్ ను కిడ్నాప్ చేసి శ్రీశైలం అడవుల్లో హత్య చేశారు. ప్రభాకర్ హత్యకు సంబంధించి పోలీసులు వివరాల ప్రకారం…
దిల్ షుఖ్ నగర్ పి అండ్ టి కాలనీకి చెందిన వి.ప్రభాకర్ కు అదే ప్రాంతానికి చెందిన దొంతుల రాములు అలియాస్ కోళ్ల రాములు కుమారై జ్యోతితో మార్చి 2000 సంవత్సరంలో వివాహం జరిగింది. అప్పటికే ప్రభాకర్ ఒక కళాశాలలో లెక్చరర్ గా పనిచేస్తున్నాడు. రాములు చిన్న కుమారై కూడా ప్రభాకర్ వద్ద చదువుకుంటున్న క్రమంలో రాములు పెద్ద కుమారై జ్యోతితో ప్రభాకర్ విహాహం జరిగింది. సరూర్ నగర్ ప్రాతంలో కొత్త జంట కాపురం పెట్టగా ప్రభాకర్, రాములు కలిసి కొన్ని ఆర్థికపరమైన లావాదేవీలు నిర్వహించేవారు. ఇరువురు కలిసి రియల్ ఎస్టేట్ వ్యాపారం కూడా చేశారు. 2002 ఎప్రిల్ 11న ప్రభాకర్ భార్య అఖస్మాత్తుగా ఆత్మహత్యకు పాల్పడింది. పెళ్లై రెండు సంవత్సరాలు అవుతున్నా పిల్లలు పుట్టలేదని బెంగతో జ్యోతి అత్మహత్యకు పాల్పడింది. ఈ మేరకు ఆమె రాసిన ఆత్మహత్య లేఖను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
అయితే జ్యోతి మరణానికి ప్రభాకర్ ఆయన కుటుంబ సభ్యులే కారణం అంటూ రాములు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన కుమారై చనిపోవడానికి ప్రభాకర్ కారణంగా కక్షపెంచుకున్న రాములు నయీం ముఠాను సంప్రదించాడు. లెక్చరర్ ప్రభాకర్ ను హత్యచేస్తే భారీగా ప్రతిఫలం ముట్టచెప్తానని చెప్పడంతో నయీం ఈ హత్యకు ఒప్పుకున్నట్టు పోలీసులు పేర్కొన్నారు. నయీంకు ప్రభాకర్ కు మధ్య ఎటువంటి గొడవలు లేవు. అసలు ప్రభాకర్ ఎవరో కూడా నయీం కు తెలియదు కేవలం రాములు తో చేసుకున్న ఒప్పందం ప్రకారణే ప్రభాకర్ ను నయీం ముఠా దారుణంగా హత్య చేసింది.  ప్రభాకర్ హత్యకు ముందు కూడా గుడ్ల రాములు కు నయీం కు మధ్య ఆర్థిక పరమైన లావాదేవీలు ఉన్నాయనే ఆరోపణలున్నాయి.
లెక్చరర్ ప్రభాకర్ హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న రాములు ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. ఆయన పోలీసులకు పట్టుబడితే ప్రభాకర్ హత్యకేసులో మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *