ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు తనయుడు లేకేష్ మంత్రిపదవి చేపట్టడం దాదాపు ఖాయం అయిపోయింది. ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించిన నేపధ్యంలో ఇక లోఖేష్ మంత్రి వర్గంలోకి రావడం లాంఛన ప్రాయమే. ఇప్పటికే పార్టీ కార్యకలాపాల్లో చురుగ్గా వ్యవహరిస్తున్న లోకేష్ ప్రభుత్వ కార్యకలాపాల్లోనూ చిరుగ్గా పాల్గొననున్నారు. మంత్రి గా పదవిని చేపడితే లోకేష్ ఏ శాఖను చేపడతారు అనే దానిపై ఇప్పుడు విస్తృతంగా చర్చ జరుగుతోంది. ప్రభుత్వ వర్గాలతో పాటుగా పార్టీలోనూ ఇదే చర్చ నడుస్తోంది. లోకేష్ మంత్రివర్గం లోకి వస్తే ప్రభుత్వంలో కీలకంగా మారే అవకాశం ఉంది. ఇప్పటికే రాజకీయాల్లో చురుగ్గా ఉంటూ వచ్చిన లోకేష్ రానున్న రోజుల్లో మరింత క్రియాశీలంగా ఎదగనున్నారు.
మంత్రి వర్గంలోకి తీసుకున్న తరువాత లోకేష్ ఎంతవరకు పదవీ బాధ్యతలను సక్రమంగా నిర్వహించగలరో చూడాల్సి ఉంది. ఉన్నత విద్యావంతుడైన లోకేష్ కు ఆర్థిక రంగంపై మంచిపట్టు ఉందని ఆయన సన్నిహితులు చెప్తుంటారు. పార్టీ వ్యవహారాల్లో తనదైన ముద్రవేసిన లోకేష్ రానున్న రోజుల్లో ప్రభుత్వ పథకాల్లోనూ ఇక నేరుగా దృష్టిపెట్టే అవకాశం ఉంది. తన రాజకీయ వారసుడిగా లోకేష్ ను తెరపైకి తీసుకుని వస్తున్న చంద్రబాబు పార్టీ వ్యవహారాలతో పాటుగా ప్రభుత్వ వ్యవహారాల్లోనూ పట్టు సాధించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. లోకేష్ తనకు అప్పగించిన బాధ్యతలను ఎంతవరకు సమర్థవంతంగా నెరవేర్చగలరు అనే దానిపై పార్టీ,ప్రభుత్వ వర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది. మంచి విజన్ ఉన్న నేతగా లోకేష్ ప్రభుత్వ వ్యవహారాల్లోనూ రాణిస్తారని ఆయన అభిమానులు అంటున్నారు. ఇప్పటికే పార్టీ వ్యవహారాల్లో లోకేష్ సమర్థనాయకుడిగా పేరుసంపాదించుకున్న నేపధ్యంలో పరిపాలనా పరంగానూ అనుభవం సాధించి మంచి నేతగా ఎదుగుతారని అంటున్నారు.