ఆధ్యాత్మికతతోనే జగతికి వెలుగు:చిన జీయర్ స్వామి

భూనుడి కిరణాలు జగతిలో వెలుగులు నింపినట్టుగా ఆధ్మాత్మిక కిరణాలు సమాజంలో శాంతి, సౌభాగ్యాలను నింపుతాయని త్రిదండి శ్రీమన్నారాయణ చిన జీయర్ స్వామి అన్నారు.  సుప్రసిధ్ద ఉప్పల్ స్వరూప్ నగర్ కరిగిరి వేంకటేశ్వరస్వామి ఆలయంలో శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భాంగా చిన జీయర్ స్వామి తన ప్రవచనంలో రథసప్తమి విశేషాలను వివరించారు. లోకానికి వెలుగునిచ్చే దినకరుడిని పూజించడం అంటే ప్రకృతిని గౌరవించడమే నని భారతీయ సంప్రదాయాల్లో ప్రకృతి ఆరాధన ఘనంగా జరుగుతుందని చెప్పారు. రథ సప్తమి కూడా రుతువుల ఆధారంగా జరుపుకునే పండుగ అని పురాతన కాలం నుండి భారతీయులు ప్రకృతిని ప్రేమించడం గొప్పగా భావించేవారన్నారు. ప్రకృతిన ప్రేమిస్తే ఆ దేవుడుని ప్రేమించినట్టేనని చిన జీయర్ స్వామి పేర్కొన్నారు. మానవ జీవితంలో ప్రతీ సమయానికి ఒక ప్రత్యేకత ఉందని ఆయన వివరించారు.  పంట రావడానికి గింజ ఎప్పుడు నాటాలో నియమం ఉంటుంది. నావద్ద గింజ ఉంది నేను ఇప్పుడే నాటుతాను అని నాటితే మొక్క వస్తుంది కానీ మనం కోరుకునట్లుగా పంట రాదు. అదే సమయానికి నాటితే ఫలితం పూర్తిగా వస్తుంది. మనకు తగినట్లు, మనం కోరినట్లు ఫలితం రావాలంటే ఏ సమయం తగినతో అది తెలుసుకొని నాటాలి అన్నారు.  సూర్యుడి అవతార దినం కనుక ఆదిత్య హృదయాన్ని పారాయణ చేస్తే తగ్గ ఫలితం వస్తుందని ఆయన వివరించారు.
 
కనిగిరి వేంకటేశ్వర దేవాలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఈనెల 6వ తేదీ వరకు జరగనున్నాయి. గురవారం అశ్వవాహనసేవ, శుక్రవారం సూర్యప్రభ, చంద్రప్రభ వాహనసేవలు, శనివారం సామూహిక కుంకుమార్చన, గరుడ సేవలతో పాటుగా రాత్రికి కల్ప వృక్షసేవ జరగనుంది. ఆదివారం గజవాహన సేవతో పాటుగా పెద్ద ఎత్తున రథోత్సవం జరగనుంది. సోమవారం నాడు బలిహరణం, పుర్ణాహుతి, చక్రతీర్థం, పుష్పయాగము, దేవతోద్వసన, శేషవాహన సేవ, సప్తవరణములు, శృంగార డోలోత్సవంతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి.
భక్తుల పాలిట కొంగు బంగారం-కరిగిరి వేంకటేశ్వర దేవాలయం
కోరిన కొరికలు తీర్చే కరిగిరి వేంటశ్వర స్వామి దేవాలయం భక్తుల పాలిట కొంగు బంగారంగా విలసిల్లుతోంది. ఉప్పల్ స్వరప్ నగర్ లో వెలసిన ఈ దేవలయానికి ఉప్పల్ పరిసర ప్రాంతాల నుండే కాకుండా హైదరాబాద్ నలుమూలల వచ్చే భక్తులు నిత్యం స్వామివారిని సేవించుకుంటున్నారు. స్వామివారి మహిమలు రోజురోజుకూ విస్తృతంగా ప్రచారం అవుతుండడంతో ఈ దేవాలయానికి వచ్చే భక్తుల సంఖ్య కూడా రోజురోజుకూ పెరుగుతోంది. ఆపద మొక్కుల వాడిగా ప్రదక్షిణాల స్వామిగా పేరుగాంచిన శ్రీ కరిగిన వేంటేశ్వర స్వామి గుడిలో ఏడు శనివారాల పాటుగా ఏడు ప్రదక్షిణలు చేస్తే చాలు  కోరికలు తీరుస్తాడని భక్తుల విశ్వాసం. దీనితో దేవాలయం ప్రాగణం అంతా ప్రదక్షిణాలు చేసే భక్తులతో కిటకిటలాడుతూ ఉంటుంది. నిత్యం దోవింద నామాలతో ఆధ్యాత్మికత ఉట్టిపడే దేవాలయ ప్రాంగణంలోకి అడుగుపెడితే చాలు భక్తులు అలౌకిక అనుభూతికి లోను కావడం ఖాయం. పంచారాత్ర ఆగమనం ప్రాకారం స్వామివారికి నిత్యం శాస్త్రోక్తంగా జరిగే పూజలు, కైంకర్యాలతో దేవాలయం వేద మంత్రోచ్చారణలతో మారుమోగుతూనే ఉంటుంది. ఆలయం లోపలికి వెళ్లగానే మనకు స్వామివారి దివ్యమంగళ రూపం కనబడుతుంది. అమ్మవార్లతో పాటు కొలువై ఉన్న శ్రీనివాసుడు భక్తులకు అభయ హస్తంతో దర్శనమిస్తూ భక్తులను తరింప చేస్తుంటాడు. స్వామి వారి దర్శనమే భక్తులకు వేయిగుల బలాన్ని ఇస్తుంది. అన్నట్టు ఈ దేవాలయం పేరు కూడా కరిగిరి దేవాలయం. కరి అంటే ఎనుగు గిరి అంటే కొండ అని అర్థం. దేవాలయ నిర్మాణానికి పూర్వం ఇక్కడ ఉన్న చిన్న రాళ్లు ఏనుగు ఆకారంలో ఉండడంతో ఈ దేవాలయానికి కరిగిరి దేవాలయం అని పేరు వచ్చింది. ఈ దేవాలయ నిర్మాణానికి 1967లో పునాది పడింది. అప్పుడు ఈ ప్రాంతం ఇప్పటి మాదిరిగా లేదు. పూర్తిగా గ్రామీణ వాతారణంలో ఊరికి దూరంగా ప్రశాంత వాతారణంలో నిండి ఉండేది. కందాడై శ్రీమాన్ ధర్మాచార్యులు ఈ దేవాలయ నిర్మాణానికి పూనుకున్నారు. ఉపాధ్య వృత్తిలో ఉన్న ఆయనకు స్వతహాగా ఆధ్యాత్మిక చింతన ఎక్కువ దీనితో పాటుగా పరోపకారానికి ఆయన పెట్టింది పేరు. అనుకోని విధంగా ఆయన కుమారుడు సర్పాశయనం స్వరూప్ కుమార్ ప్రమాణంలో ప్రాణాలు కోల్పోవడంతో కుమారుడి పేరు మీద ఏదైనా మంచి కార్యం చేపట్టాలని భావించారు ధర్మాచార్యల వారు. ఈ క్రమంలో ఒక రోజు ఉప్పల్ పొలిమేరల్లో పర్యటిస్తుండగా ఎనుగును పోలిన రెండు శిలలు ఉన్న ప్రాంతానికి రాగానే ఆయన మనసు ప్రశాంతతో నిండిపోయింది. అక్కడే దేవాలయ నిర్మాణానికి పూనుకున్న ఆయన 1967లో  పంచ ముఖ ఆంజనేయ స్వామి దేవాలయాన్ని నిర్మించారు. కొద్ది రోజుల తరవాత ఒక రోజు ధర్మాచార్యుల కలలో శ్రీనివాసుడు దర్శనమిచ్చి తనకు ఆలయాన్ని నిర్మించాలని, ఈ ప్రాంతంలో జనావాసాన్ని నిర్మించాలని ఆదేశించారు. దీనితో పంచముఖ అంజనేయ స్వామితో పాటుగా శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయ నిర్మాణం, జనావాసాల అభివృద్దికి పూనుకున్నారు. మంచి పనికి స్వామివారి ఆశీస్సులు ఎల్లప్పూడూ ఉంటాయి కనుక ఆయన కార్యాలని మిత్రులు , శ్రేయోభిలాషుల అంగ ఆర్థిక సహాయం లభించడంతో దేవాలయ నిర్మాణం పూర్తయింది. 1971 ఎప్రిల్ 30న స్వామివారి ప్రతిష్ట సుప్రసిద్ద ఆగమన పండితులు చిలకమర్రి శ్రీనివాసాచార్యుల  చేతుల మీదుగా జరిగింది. అప్పటి నుండి స్వామివారి దేవాలయం దినదిన ప్రవర్థమానంగా వెలుగొందుతోంది. పంచముఖ ఆంజనేయ దేవాలయంతో పాటుగా బొజ్జగణపయ్య కోరిన వారికి వరాలను ప్రసాదిస్తున్నారు. ప్రస్తుతం ధర్మాచార్యల వారసులు దేవాలయ నిర్వహణ బాధ్యతలను నిర్వహిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *