చలామణిలోకి రు.200నోటు

0
52

ఆర్బీఐ కొత్త 200 రూపాయల నోట్లను చలామణిలోకి తీసుకుని రానుంది. పాత నోట్ల రద్దు నిర్ణయం తర్వాత కొత్తగా వస్తున్న నోట్లలో ఇది మూడవది. ఇప్పటికే రెండువేల, 500 రూపాయల నోట్లు చలామణిలోకి రాగా ఇప్పుడు రెండు వందల రూపాయల నోట్లు చలామణిలోకి రానున్నాయి. రెండు వందల రూపాయల నోట్లను గతంలో ముద్రించిన దాఖలాలు లేవు.కొత్త 200 రూపాయల నోట్లను ఆగస్టు 25వ తేదీ నుండి చలామణిలోకి తీసుకుని రానున్నారు. ఈ నోటు పసుపు రంగులో ఉంది. నోటు వెనుక భాగంలో సాంచి స్తూపం బొమ్మను ముద్రించారు.
ప్రస్తుతం వంద రూపాయల నోట్లు అందుబాటులో ఉండగా దాని తరువాత 500 రూపాయలే అందుబాటులో ఉంది. ఈ రెండు నోట్లకు మధ్యలో రెండు వందల రూపాయల నోట్లను తీసుకుని రావడం వల్ల దేశవ్యాప్తంగా ప్రజలు ఎదుర్కొంటున్న చిల్లర సమస్యను నివారించడానికి వీలవుతుందని ఆర్బీఐ భావిస్తోంది.

Wanna Share it with loved ones?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here