హేచ్-1 బి విసాల నిబంధనల్లో భారీ మార్పులు

 
భారతీయ ఐటీ కంపెనీలకు భారీ దెబ్బ…. ఎన్నికల ముందు నుండి చెప్తూ వస్తున్న ట్రంప్ ఐటీ కంపెనీల మీద బండపడింది.  ది హై స్కిల్డ్‌ ఇంటెగ్రిటీ అండ్‌ ఫెయిర్‌నెస్‌ యాక్ట్‌ 2017ను అమెరికా హౌస్‌ ఆఫ్‌ రిప్రజెంటేటివ్స్‌కు చేరింది. ఈ బిల్లు వల్ల హెచ్-1 బి వీసాలపై భారీగా దెబ్బపడనుంది. భారత్ కు చెందిన ఐటి నిపుణులు ఎక్కువగా అమెరికాకు వెళ్లేది ఈ వీసా ద్వారానే.  కాలిఫోర్నియా కాంగ్రెస్‌ సభ్యుడు జో లోప్గ్రెన్‌  ఈ బిల్లును  ప్రవేశపెట్టారు. ఈ బిల్లు ప్రకారం విదేశీ ఐటి నిపుణులకు కనీసం లక్షా 30వేల డాలర్లు చెల్లించాల్సి ఉంటుంది. ప్రస్తుతం అది 60వేల డాలర్లగా ఉంది. ప్రస్తుతం ఉన్న దాని కన్నా రెట్టింపుకన్నా ఎక్కువ.
ఈ చట్టంలో మార్పుల వల్ల విదేశాలకు చెందిన వారిని నియమించుకునే వారికి ఐటి కంపెనీలు భారీ మొత్తంలో వేతనాలు చెల్లించాల్సి ఉంటుంది. దీనితో వారి స్థానంలో అమెరికన్లనే నియమించుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. భారతీయ ఐటి నిపుణులకు అవకాశాలు తగ్గే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఈ నిర్ణయం వల్ల దేశీయ ఐటీ కంపెనీలపై తీవ్ర ప్రభావం పడుతుంది. ఈ బిల్లుపై  సెనెటర్‌ షీర్డ్‌ బ్రౌన్‌ మాట్లాడుతూ  ఇప్పటి వరకు హె1బీ వీసాల్లో ఎల్‌1 వీసాల్లో ఉన్న లోపాలను సరిచేశామన్నారు. ఈ బిల్లు ద్వారా ప్రస్తుతం  వర్కు వీసాల సంఖ్యపై దేశాలపై ఉన్న  గరిష్ట  పరిమితిని ఈ బిల్లులో తొలగించారు.  దీని వల్ల ప్రతిభ ఆధారంగా ఉద్యోగాల్లోకి తీసుకోవచ్చు. దీంతోపాటు ప్రస్తుతం ఇచ్చే హెచ్‌1బీ వీసాల్లో 20శాతం స్టార్టప్‌లకు కేటాయిస్తారు.
అమెరికా తీసుకున్న ఈ నిర్ణయం వల్ల ఐటి కంపెనీలు భారీగా నష్టపోయాయి.  టీసీఎస్‌, విప్రో, హెచ్‌సీఎల్‌ షేర్లు మార్కెట్లో ఒక్కసారిగా పతనమయ్యాయి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *