దాసరికి తీవ్ర అనారోగ్యం

 

    సినీప్రముఖుడు,కేంద్ర మాజీ మంత్రి దాసరి నారాయణ రావు తీవ్ర అనారోగ్యంతో ఉన్నారు. ఆయన్ను ఈ ఉదయం హైదరాబాద్ కిమ్స్ ఆస్పత్రికి తరలించారు. దాసరిని ఐసీయులో ఉంచినట్టు సమచారం. ఊపరిదిత్తులు, మూత్రపిండాల సమస్యతో ఆస్పత్రిలో చేరిన దాసరి వైద్యులు శస్త్ర చికిత్స నిర్వహించారు. చాలా కాలంగా దాసరి మూత్రపిండాల సమస్యతో బాధపడుతున్నారు. ప్రస్తుతం ఆయనకు డయాలిసిస్ చేసిన వైద్యులు వెంటిలేటర్ పై ఉంచారు. దాసరి ఆనారోగ్య సమాచారం అందుకున్న పలువురు ఆయన్ను పరామర్శించారు. నటుడు మోహన్ బాబుతో పాటుగా సినీ,రాజకీయ ప్రముఖులు దాసరి ఆరోగ్య పరిస్థితిని వాకబు చేస్తున్నారు. దాసరికి పూర్తి స్థాయి చికిత్సను అందచేస్తున్నట్టు కిమ్స్ వర్గాలు వెల్లడించాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *